YS Jagan: రాబోయేది మా ప్రభుత్వమే!
ABN , Publish Date - Jan 13 , 2025 | 04:11 AM
మళ్లీ రాబోయేది మా ప్రభుత్వమే ఎవరి మాటలో విని అనవసరంగా ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు’ అని పులివెందుల డీఎస్పీని మాజీ సీఎం జగన్ హెచ్చరించినట్లు తెలిసింది.
ఎల్లకాలం కూటమి సర్కారు ఉండదు
పులివెందుల డీఎస్పీకి జగన్ వార్నింగ్!!
కడప, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ‘మళ్లీ రాబోయేది మా ప్రభుత్వమే ఎవరి మాటలో విని అనవసరంగా ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు’ అని పులివెందుల డీఎస్పీని మాజీ సీఎం జగన్ హెచ్చరించినట్లు తెలిసింది. శనివారం వైఎస్ అభిషేక్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పులివెందుల వచ్చిన జగన్.. సాయంత్రం బెంగళూరుకు బయల్దేరి వెళ్లే సమయం లో హెలికాప్టర్ వద్ద పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ను పిలిచి ఘా టుగా మాట్లాడినట్లు తెలిసింది. ‘ఎల్లకాలం కూటమి ప్రభుత్వమే ఉంటుందనుకోవద్దు.. మళ్లీ మేం వచ్చినపుడు వైసీపీ వారిని ఇబ్బంది పెట్టిన వారందరినీ ప్రత్యేక దృష్టితో చూస్తాం’ అని హెచ్చరించినట్లు తెలిసింది. అందుకు డీఎస్పీ బదులిస్తూ.. ఎవరి మాటలో విని కేసులు బనాయించడం లేదని, చట్టప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టంచేసినట్లు సమాచారం. దీంతో జగన్ మరోమారు అనవసరంగా ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని డీఎస్పీని హెచ్చరించినట్లు తెలిసింది.