Share News

JC Prabhakar Reddy: జగన్‌.. నీ పనైపోయింది!

ABN , Publish Date - Jan 13 , 2025 | 03:04 AM

‘రాజకీయాల్లో నీ పనైపోయింది. నీవో ఫేడౌట్‌ నాయకుడివి. నీది రాబంధుల పార్టీ’ అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి మండిపడ్డారు.

JC Prabhakar Reddy: జగన్‌.. నీ పనైపోయింది!

తైతక్కలాడే రోజమ్మా... నోరు అదుపులో పెట్టుకో: జేసీ

అనంతపురం, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ‘రాజకీయాల్లో నీ పనైపోయింది. నీవో ఫేడౌట్‌ నాయకుడివి. నీది రాబంధుల పార్టీ’ అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి తొక్కిసలాటపై జగన్‌ వ్యాఖ్యలకు ఆయన ఆదివారం అనంతపురంలో ఘాటుగా స్పందించారు. జగన్‌వన్నీ శవ రాజకీయాలేనన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎన్నో ఘటనలు జరిగాయనీ, ఎంతోమంది ప్రాణాలు పోయాయని తెలిపారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 33 మంది చనిపోతే, అప్పుడెందుకు అక్కడికెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించలేదని జగన్‌ను నిలదీశారు. ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనలో 13 మంది చనిపోతే.. అక్కడికెందుకు వెళ్లలేదని, రుయా ఆస్పత్రిలో 12 మంది చనిపోతే అక్కడికెందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ‘జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి అనేక మంది చనిపోతే. అక్కడికెళ్లి పరామర్శించావా? బోటు ప్రమాదంలో 39 మంది చనిపోతే. అక్కడికెళ్లావా? మరి ఆగమేఘాల మీద ఇప్పుడెందుకు వెళ్లావ్‌?’ అని నిలదీశారు. ‘రోజక్కా... నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఆనం కుటుంబం గురించి తెలుసుకుని మాట్లాడు. తైతక్కలాడే రోజమ్మా నోరు అదుపులో పెట్టుకో. నేను నోరు విప్పితే నీ బండారమంతా బయటపడుతుంది’ అని హెచ్చరించారు. చంద్రబాబు పుణ్యమా అని రాజకీయాల్లోకి వచ్చావన్నది మర్చిపోవద్దని, మరోసారి నోరు పారేసుకుంటే కార్యకర్తలు బయట తిరగనివ్వరని చెప్పారు. అనంతపురంలో రోజాపై చెక్‌బౌన్స్‌ కేసులున్నాయన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 03:04 AM