శ్రీవారి సేవలో జస్టిస్ గోపాలకృష్ణారావు..
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:17 AM
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణారావు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల, మార్చి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణారావు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూ లమూర్తిని దర్శించుకున్నారు. అంతకుముందు సుప్రీంకోర్టు మాజీ న్యా యమూర్తి జస్టిస్ సి.నాగప్పన్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.