అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
ABN , Publish Date - Apr 19 , 2025 | 11:50 PM
లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు జరిగి నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫైర్ సిబ్బంది ఆసు పత్రిలో విన్యాసాలు నిర్వహించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో విన్యాసాలు చేసి చూపించిన ఫైర్ సిబ్బంది
లక్కిరెడ్డిపల్లె, ఏప్రిల్19(ఆంధ్రజ్యోతి): లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు జరిగి నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫైర్ సిబ్బంది ఆసు పత్రిలో విన్యాసాలు నిర్వహించారు. అగ్నిమాపక వా రోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక ప్రభు త్వా సు పత్రిలో అగ్ని ప్రమాదాలపై అవ గా హన కార్యక్రమలు నిర్వ హిం చారు. ఈ సందర్భంగా ఆసు పత్రిలో అగ్నిప్ర మా దంలో జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫైర్ ఆఫీసర్ రామయ్య, సిబ్బందితో విన్యాసాలు నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రమాదవ శాత్తు విద్యుత వల్ల అగ్ని ప్రమాదాలు జరిగితే ఎదుర్కో వాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్ర మంలో ఆసుపత్రి సూ పరిండెంట్ నీలోఫర్‌బేగం, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫైర్ సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫైర్ ఆఫీసర్ రామయ్య, సిబ్బందితో విన్యాసాలు నిర్వహించారు.