Share News

సోషల్‌ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:25 AM

సోషల్‌ మీడియా ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్య మాల్లో ఎవరైనా తప్పుడు సమాచారం షేర్‌ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు హెచ్చరించారు.

సోషల్‌ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి
మీడియాతో మాట్లాడుతున్న ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు

తప్పుడు సమాచారం షేర్‌ చేస్తే కేసులు

ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు

రాయచోటిటౌన్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియా ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్య మాల్లో ఎవరైనా తప్పుడు సమాచారం షేర్‌ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు హెచ్చరించారు. శుక్రవారం ఆయన అన్నమయ్య పోలీస్‌ వాట్సాప్‌ ఛానల్‌ను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మీ పరిధిలో చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్న వారి వివరాలు స్థానిక పోలీసులకు తెలియజేయా లన్నారు. ఏదైనా అధికార సమాచారం వస్తే నే ప్రజలు నమ్మాలన్నారు. అత్యాధునిక టెక్నా లజీ ఉపయోగించి, ఇంటర్నెట్‌ ద్వారా వాట్సా ప్‌, ఫేస్‌బుక్‌, టెలిగ్రాం, ఎక్స్‌, ఇన్‌స్ర్టాగ్రాం తదితర సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టామని, ఏదైనా తప్పుడు సమాచారం వైరల్‌ అవుతుంటే ఆయా గ్రూప్‌ అడ్మిన్‌లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వాట్సాప్‌ ఛానల్‌ను జిల్లా ప్రజలు అందరూ ఫాలో అయి ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పోలీసుల అధికారిక సమాచారం తెలుసుకోవచ్చన్నారు. ప్రతిఒక్కరూ ముందుగా మీ వాట్సాప్‌ను అప్డేట్‌ చేసిన వెంటనే అన్నమయ్య పోలీసు వాట్సాప్‌ ఛానల్‌ కనబడుతూ ఉంటుందని, ఎప్పటికప్పుడు పోలీసుల తాజా సమాచారాన్ని వీక్షించవచ్చన్నారు.

కోడి పందేలు, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు

సంక్రాంతి పండుగ రోజుల్లో సాంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జూద క్రీడలు కాకుండా సాంప్రదాయ ఆటలు ఆడుకోవాలని సూచించారు. కోడిపందేలు, పేకాట, గుండాట, చెక్కాబొమ్మ ఇలా ఏ జూద వ్యసనమైనా ప్రజల జీవితాలను నాశనం చేస్తుందన్నారు. అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని తెలిపారు. కోడిపందేలు జూదరులు, కోడి కత్తుల తయారీదారులు, పేకాట శిబిరాల నిర్వాహకులపై ఇప్పటికే గట్టి నిఘా ఉంచామన్నారు. సంక్రాంతి పండుగను పురష్కరించుకొని ఎవరైనా జిల్లాలో కోడి పందేలు నిర్వహించినా పందేలు నిర్వహణకు స్థలాలు, భూములు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు యువకులు జూదాలకు బానిసలై కేసుల్లో ఇరుక్కుపోయి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటారన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే సంబంధిత పోలీస్‌స్టేషన్‌ వారికి లేదా డయల్‌ 100/112కు ఫోన్‌ చేసి సమాచారం తెలియజేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ పేర్కొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 12:25 AM