రాజంపేట గంగమ్మ జాతరకు అంకురార్పణ
ABN , Publish Date - Mar 30 , 2025 | 11:57 PM
ఉమ్మడి కడపజిల్లాలో ప్రఖ్యాతిగాంచిన రాజంపేట గంగమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది.

రాజంపేట టౌన, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి కడపజిల్లాలో ప్రఖ్యాతిగాంచిన రాజంపేట గంగమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ జాతర చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్య లో గంగమ్మతల్లిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తు లు పాల్గొంటారు. గంగమ్మ జాతర అంకురార్పణ సందర్భంగా దున్నపోతును ఆదివారం ఉగాది నాడు జాతర నిర్వాహకులు ఊరేగించారు.ఈ ఊరేగింపులో పెద్దఎత్తున యువత పాల్గొన్నారు.ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు పాల్గొనడంతో మరో జాతరను తలపించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సీఐ రాజా, ఎస్‌ఐలు లక్ష్మీప్రసాద్‌రెడ్డి, నవీన ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఘట్టి బందోబస్తు నిర్వహించారు. జాతరను మూడో తేది నిర్వహించనున్నట్లు తెలిపారు.