విద్యుత సమస్యలపై వెంటనే స్పందించాలి
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:33 PM
వ్యవ సాయానికి సంబంధించి విద్యుత సమస్యలు వచ్చిన వెంటనే అధికారులు స్పందించి పరి ష్కరించాలని విద్యుత శాఖ సూపరెంటెండెం ట్ ఎస్.రమణ ఆదేశించారు.
విద్యుతశాఖ సిబ్బందికి ఎస్‌ఈ రమణ ఆదేశం
అట్లూరు, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : వ్యవ సాయానికి సంబంధించి విద్యుత సమస్యలు వచ్చిన వెంటనే అధికారులు స్పందించి పరి ష్కరించాలని విద్యుత శాఖ సూపరెంటెండెం ట్ ఎస్.రమణ ఆదేశించారు. శనివారం కొం డూరు సబ్‌స్టేషనను ఆకస్మిక తనిఖీ నిర్వ హించి రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత వినియోగ దారులకు అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ఎండలు భగభ గమండిపోతున్నాయని ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువ ఎండలు ఉంటాయని, విద్యుత అంతరాయం సహించే స్థితిలో ప్రజలు లేరని, విద్యుత అంతరాయలు ఏర్పడినప్పుడు ఎందుకు కలిగిందో పరిశీలించి మరమ్మ తులు చేసి అంతరాయాలు లేని విద్యుత అం దించాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు గాలీవాన మెరుపుల ప్రబావం విద్యుత వ్యవస్థపై ఉం టుందని, తగు చర్యలు తీసుకోవాలని ఏఈ విజయ కుమార్‌కు సూచించారు. రాబోవు పంట కాలం ఖరీఫ్ సీజను నాటికి వ్యవసాయ సర్వీ సులు విడుదల చేసేందుకు కార్యా చరణ రూపొందించాలని ఆదేశించారు. కార్యాలయ ప్రాంగణంలోని ట్రాన్సఫార్మర్లు కార్య రూపం దాల్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు విద్యుత సమస్యలు ఎప్పటి కప్పుడు పరిష్కరించాలని కార్యాలయాల చుట్టూ తిప్పుకునే సంస్కృతి విడనాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లైన ఇనస్పెక్టరు గోపాల్, లైనమెన ఉన్నారు.