మూగరోదన.. రైతు ఆక్రందన
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:39 PM
గొంతు వాపు, పారుడు వ్యాధితో గొర్రెలు, మేకలు మృ త్యువాత పడుతున్నాయి. దీంతో వాటి యజ మానులైన రైతన్నలు దిక్కుతోచన స్థితిలో ఉన్నారు.
గొంతువాపు, పారుడు వ్యాధితో
గొర్రెలు, మేకలు మృత్యువాత
వైద్య చికిత్స అందించి
ఆదుకోవాలంటున్న యజమానులు
బి.కోడూరు, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి) : గొంతు వాపు, పారుడు వ్యాధితో గొర్రెలు, మేకలు మృ త్యువాత పడుతున్నాయి. దీంతో వాటి యజ మానులైన రైతన్నలు దిక్కుతోచన స్థితిలో ఉన్నారు. మండల పరిధిలోని రెడ్డివారిపల్లె, గొడుగునూరు, నల్లవాగుపల్లె గ్రామాల్లో చాలా మంది రై తులు గొర్రెలు, మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత వారం రోజుల నుంచి ఉన్నట్లుండి మేకలకు, గొర్రెలకు గొంతు వాపు రావడం, కడుపుబ్బరం, పారుడుతో వెం టనే చనిపో తున్నాయని రైతులు ఆవేదన చెం దుతున్నారు. వైద్యాధికారులను పిలిచినిప్పటికీ వ్యాధికి తగిన చికిత్స చేయలేని పరిస్థితి నెల కొందంటున్నారు. రెడ్డివారిపల్లె గ్రామంలోని సుంకర పెద్దన్నకు చెందిన 20మేకలు, 30 గొర్రెలు మృతి చెందగా కత్తికొండయ్యకు చెంది న 15 మేకలు, తులశమ్మకు చెందిన 16 మేకలు గత వారం నుంచి చనిపోతున్నాయి, సుంకర పెద్దన్న అనే రైతు మేకలు ఎందుకు చనిపోతు న్నాయో కడుపులో ఏమైందోనని చనిపోయిన ఒక మేకను కోసి చూడగా లివర్ పొడలు పొడ లుగా బొబ్బలు బొబ్బలుగా ఉందని చెబుతు న్నాడు. ఇప్పటికైనా ఉన్నత వైద్యాధికారులతో వైద్య శిబిరం ఏర్పాటు చేసి మేకలకు, గొర్రెలకు వచ్చే వ్యాధికి సకాలంలో వైద్యం అందించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
పశువైద్యం ఏదీ..?
మండలంలో చాలా మంది రైతులు పాడి పశు వులు, గొర్రెలు, మేకలు మీదనే ఎక్కువగా ఆధా రపడి జీవిస్తున్నారు. లక్షలు వెచ్చించి పశువును కొనుగోలు చేసి తీసుకువస్తే ఆ పశువుకు జబ్బు చేసిందంటే రైతు నష్టపోవాల్సిందే. అధు నాతన వైద్యం పశువులకు అందిస్తున్నా ఏ ఒక్క పశువును ఇంత వరకు వైద్యాధికారులు బతికిం చలేదనే వాదన రైతుల్లో వినబడుతుంది. మేక లు, గొర్రెలు కూడా అంతే. ఇటీవల గోవిందా యపల్లెలో చెన్నారెడ్డి అనే రైతుకు చెందిన లక్ష రూపాయల పాడిపశువుకు జబ్బు చేసింది. వెద్యాధికారిని సంప్రదించగా వచ్చి చూసి ముసర వ్యాధి వచ్చిందని మందులు తీసుకుర మ్మని చెప్పి వాడిన పశువు బతకలేదు. ఇలా మండలంలో ఏదోక గ్రామంలో తరచూ పశువు లు చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
పశువైద్యాధికారి ఏమన్నారంటే..
పశువులు, గొర్రెలు, మేకలు మృత్యువాత విష యమై పశువైద్యాధికారి భరద్వాజ క్రిష్ణను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా కలుషిత నీరు, కలుషిత మేత తినడంతో లివర్ దెబ్బతిని చనిపోతున్నాయని తెలిపారు. రైతులు అడిగితే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తామని తెలిపారు.