ఘనంగా యేసుక్రీస్తు పునరుత్థాన పండుగ
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:52 PM
స్థానిక సిద్దవటం రోడ్డులోని సీఎస్‌ఐ చర్చిలో యేసుక్రీస్తు పునరుత్థాన పం డుగను ఘనంగా నిర్వహించారు.
బద్వేలు రూరల్/ముద్దనూరు, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): స్థానిక సిద్దవటం రోడ్డులోని సీఎస్‌ఐ చర్చిలో యేసుక్రీస్తు పునరుత్థాన పం డుగను ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా పాస్టర్ స్వరాజ్‌జీవనబాబు మాట్లాడు తూ గుడ్‌ఫ్రైడే రోజున శిలువలో మరణించిన ఏసుప్రభు ఆదివారం నాడు మరణం గెలిచి తిరిగి లేచాడని ఏసుప్రభు మరణం జయించి మృత్యుంజయుడుగా పునరుత్థానుడుగా జ్ఞాపకం చేసుకుంటూ భక్తిశ్రద్ధలతో ఈ పం డుగ జరుపుకుంటారని తెలిపారు. ఈ కర్యాక్రమంలో చర్చి పరిపాలన సెక్రటరీ కిరణ్ ఎన్వర్డ్, మూరతోటి సునీల్‌కుమార్, స్వరాజ్, ప్రసన్న, జ్యోతి, స్ర్తీ మైత్రి విభాగ వవైస్ ప్రెసిడెంట్ సునీతజీవన, సెక్రటరీ జానకమ్మ, దేవనందం, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
ముద్దనూరు మండంలోని చర్చిలలో ఆదివారం ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీజీ, సీఎస్‌ఐ, హెబ్రోను,మన్న, హోసన్న, పెంతేకోస్తూ, గుత్తిశాల చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎస్పీజీ చర్చిలో పాస్టర్ రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావు ఈస్టర్ పండుగ ముఖ్య సందేషాన్ని భక్తులకు బోధించారు.పండుగ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
రాజుపాలెంలో:ఈస్టర్ వేడుకల్లో భాగంగా ఆదివారం వివిధ గ్రామాల్లోని క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. శుక్రవారం శిలువ వేసిన ఏసుక్రీస్తు తిరిగి ఆదివారం జన్మించారని ఈ పండుగ జరుపుకుంటారు. వేకువజామున 4గంటల నుంచి కొత్త బట్టలు ధరించి చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం యువకులు, పిల్లలు వసంతాలు, రంగులు చల్లుకుంటూ ఆనందంగా ఈ పండుగ జరుపుకున్నారు. సాయంత్రం వేళల్లో వివిధ గ్రామాల్లో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు.
ప్రొద్దుటూరు టౌన్‌లో: పట్టణంలోని వివిధ చర్చిలలో క్రైస్తవులు ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం చర్చిలలో ఫాస్టర్లు యేసుక్రీస్తు గొప్పతనం, బైబిల్ ప్రాధాన్యత, ఈస్టర్ పండుగ ప్రాముఖ్యత గురించి వివరించారు. రామేశ్వరంలోని సీఎస్‌ఐ చర్చిలో డివిజనల్ ఛైర్మన్ రెవరెండ్ జాకోబ్‌ప్రాంక్ తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రత్యేక ఆరాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు మానవుల పాపాలను ప్రక్షాళన చేయడం కోసం శిలువ వేయబడ్డారని శుక్రవారం శిలువ వేయగా మూడవ రోజు ఆదివారం పునరుత్తానం అయ్యారని పేర్కొన్నారు. యేసుక్రీస్తు పునరుత్తానం అయిన సందర్భంగా ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్బంగా చర్చిలలో భక్తిగీతాలు ఆలపించారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు, క్రైస్తవులు పాల్గొన్నారు.