Share News

స్వర్ణాంధ్ర సృష్టికర్త .. పేదలపెన్నిధి చంద్రబాబు

ABN , Publish Date - Apr 20 , 2025 | 11:48 PM

స్వర్ణాంధ్ర సృష్టికర్త.. పేదల పెన్నిధి, ఆంధ్రప్రదేశ భవిష్యత్తును కాపాడగల నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు.

స్వర్ణాంధ్ర సృష్టికర్త .. పేదలపెన్నిధి చంద్రబాబు
ప్రొద్దుటూరులో చంద్ర బాబు పుట్టిన రోజు వేడుకల్లో కేక్‌ కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

ఘనంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకలు కేక్‌ కట్‌చేసి సంబరాలు జరుపుకున్న టీడీపీ శ్రేణులు, అభిమానులు

ప్రొద్దుటూరు ,ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : స్వర్ణాంధ్ర సృష్టికర్త.. పేదల పెన్నిధి, ఆంధ్రప్రదేశ భవిష్యత్తును కాపాడగల నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్దానిక టీడీపీ కార్యాల యం వద్ద సీఎం చంద్రబాబునాయుడు 75వ వజ్రోత్సవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ను కట్‌ చేసి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ప్రజ లకు పంచిపెట్టారు. అనంతరం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మా ట్లాడుతూ చంద్రబాబునాయుడు 75 ఏళ్ల వయస్సులోనూ గాడితప్పిన రాష్ట్ర పరిపాలన ను చక్కపెడుతున్నారన్నారు. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని రాష్ట్రంలో ఎన్నో కష్ట నష్టాలకు నిలబడి పార్టీని ఆయన నిలబెట్టారన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం వేగవంతం చేస్తున్నాడన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి కృషి చేస్తున్నారన్నారు. కకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్ల య్య, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు విఎస్‌ ముక్తియార్‌, ఆసం రఘురామిరెడ్డి, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటశాల వెంకటేశ్వర్లు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఈవీ సుధాకర్‌ రెడ్డి, మాజీ కౌన్సిల్లర్లు వద్ది బాలుడు, గంజికుంట ఆంజనేయులు, చౌడం వెంకట కొండయ్య, బాదుబోయిన సుబ్బారావు టీడీపీ నియోజక వర్గ పార్టీ అబ్జర్వర్‌ ప్రసాద్‌లు పాల్గొన్నారు.

బద్వేలులో: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను బద్వేలు నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు చెరుకూరి రవికుమార్‌ నాయుడు ఆఽధ్వ ర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బద్వే లు నియోజక వర్గ వ్యాప్తంగా ఉన్న అనాఽథాశ్ర మాలతోపాటు వృద్ధాశ్రమాల్లో సుమారు వంద బియ్యం ప్యాకెట్లు బ్రెడ్లు ప్యాకె ట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవి కుమార్‌ మా ట్లాడుతూ ఆంధ్రరాషా్ట్రన్ని అన్నివిధాలుగా అభివృద్ధిపథంలో నడిపి స్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గ జనసేన నాయకుడు బసవి రమేశ, మాజీ జడ్పీటీసీ బీరం జయరామిరెడ్డి, బ ద్వేలు మున్సిపాలిటీ మాజీ అధ్యక్షుడు కొంకుల రాంబాబు, కల్లూరి నాగిరెడ్డి, బాలక్రిష్ణ, బద్వేలు నియోజకవర్గ చెరుకూరి రవికుమార్‌ యూత టీం పాల్గొన్నారు. అలాగే బద్వేలు పట్టణంలో ఆర్యవైశ్య సంక్షేమ కార్పొరేషన డైరెక్టరు పరిటాల వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి ఘనంగా సంబ రాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర డైరెక్టర్‌ మాట్లాడు తూ అభివృద్ధి, సంక్షేమం సీఎం చంద్రబాబునాయుడు నాయక త్వంలో మాత్రమే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్య వైశ్య ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రజలు పాల్గొన్నారు.

జమ్మలమడుగులో: జమ్మలమడుగులో టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వారు టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ సింగంరెడ్డి నాగేశ్వరరెడ్డి, ఇతర నాయకులు స్వీట్లు పంచిపెట్టారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్‌చార్జిలు, బూత్‌ ఇన్‌చార్జిలు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ఎర్రగుంట్లలో: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 75వ వజ్రోత్సవ జన్మదిన వేడుకలు ఎర్రగుంట్ల టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ టౌన, మండల అధ్య క్షులు ఎస్‌.సంజీవరెడ్డి, ఎం.మోహనరెడ్డిలు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు కేక్‌కట్‌ చేశారు. స్థానిక అనాఽథాశ్రమంలో బ్రెడ్డు, బిస్కెట్లను పంపిణీచేశారు. రమేష్‌నాయుడు, నాగభూషణంరెడ్డి, చాంద్‌బాషా, కొండారెడ్డి, డి.రాజారెడ్డి, మల్లేసు పాల్గొన్నారు.

కొండాపురంలో: మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకు న్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి టీడీపీ నాయ కులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంటో మండల టీడీపీ అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, లావనూరు నారాయణ రెడ్డి, తిమ్మాపురం బాబుల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, చామలబాబురెడ్డి, పద్మజ, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముద్దనూరులో:మండల కేంద్రంలో సీఎం చంద్రబాబునాయుడు పుట్టిన రోజు వేడుకలను ఆదివారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ కార్యాలయం వద్ద నుంచి ర్యాలీగా పాత బస్టాండుకు చేరుకుని పాత బస్టాండు సర్కిల్‌లో బర్త్‌ డే కేక్‌ కట్‌ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు శివరామిరెడ్డి, కుడుముల శశిధర్‌రెడ్డి,కేశవరెడ్డి, జగదీశ్వరరెడ్డి, రంగారెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి, శేఖర్‌నాయుడు, ఆది, శ్రీకాంత్‌, బాబురెడ్డి, నాగేశ్వరరావు, సాయి నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

మైలవరంలో: మైలవరంలోని డాడీ హోమంలో సీఎం చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను పురష్కరించుకుని ఆదివారం అనాథలకు పండ్లను టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో మైలవరం మండల నాయకులు సూర్యపెద్దిరాజు, పెద్దపాపిరెడ్డి, కొండయ్యయాదవ్‌, చంద్ర, హరి, పాల్గొన్నారు.

అట్లూరులో : టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకలు అట్లూరులో మం డల టీడీపీ అధ్యక్షుడు పాపుదిప్పు మల్లిఖార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎస్‌.వెంకటాపురం టీడీపీ కార్యాలయం లో కేక్‌ కట్‌ చేసి టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. అలాగే అట్లూరు క్రాస్‌ రోడ్డు వద్ద బద్వేలు సంజీవని ఆసుపత్రి వైద్యాధికారులు ఆర్తో సర్వజిత సేన చక్రధర్‌రెడ్డి వారి ద్వారా మెడికల్‌ క్యాంపు నిర్వహించి 200 మందికి వైద్యచికిత్సలు నిర్వ హించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం పేద వారికి చీరలు, పంచలు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్ర మంలో ఏపీ పంచాయతీరాజ్‌ చాంబరు ఉపాధ్యక్షుడు మునిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు మహేశ్వర్‌ఎడ్డి, మండల యువ నాయకు డు జయక్రిష్ణారెడ్డి, టీడీపీ యూత లీడరు విష్ణువర్ధనరెడ్డి, అల్లం వెంకటసుబ్బయ్య, ఈటె మస్తాన, మట్టి గంగిరెడ్డి, పరమేశ, బాబా లేబాకు రామక్రిష్ఱరెడ్డి, పరశురనాం, యేసయ్య, ఎల్‌.నారాయణ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పోరుమామిళ్లలో: సీఎం చంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకలు పోరుమామిళ్లలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఎంపీటీసీ కల్వకూరి రమ ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 75 టెంకా యలు కొట్టి పూజలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండు ఆవరణలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి అభిమానులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈసందర్భం గా మార్కెట్‌యార్డు మాజీ చైర్మన చెరుకూరి చెన్నరాయుడు, ఎం పీటీసీ కల్వకూరి రమణ, నడిపి వెంకటసుబ్బయ్య, కల్లూరి వెంక టక్రిష్ణారెడ్డి, క్రిష్ణారెడ్డి, మల్లిఖార్జునరెడ్డి, కొండా రామక్రిష్ణారెడి నాయబ్‌రసూల్‌, కరీముల్లా, అన్వర్‌, పాపయ్య, మురళీ, నాగేంద్ర పాల్గొన్నారు. పోరుమామిళ్ల టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకుడు బొజ్జ రోశన్న, పోరుమామిళ్ల మేజరు పంచాయతీ సర్పంచ యనమల సుధాకర్‌ కేక్‌ కట్‌ చేసి అభిమానులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్ల్టీ అధ్యక్షుడు నగరి భైరవ ప్రసాద్‌, జిల్లా కార్యదర్శి తిరుమల శెట్టి సుబ్బారావు, కనమర్ల పూటి రామసుబ్బారావు, సీతా వెంకట సుబ్బయ్య, బ్రహ్మయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 11:48 PM