Share News

దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర కీలకం

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:53 PM

తాళ్లపాక బోయనపల్లెలో ఉన్న శాన్వి ఇంటర్నేషనల్‌ స్కూల్లో బుధవారం వార్షికోత్సవాలు అంబరాన్నంటాయి.

దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర కీలకం
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఏఎస్పీలు, చైర్మన శరతకుమార్‌రాజు

‘శాన్వి’ వార్షికోత్సవంలో ఏఎస్పీలు

రాజంపేట, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : తాళ్లపాక బోయనపల్లెలో ఉన్న శాన్వి ఇంటర్నేషనల్‌ స్కూల్లో బుధవారం వార్షికోత్సవాలు అంబరాన్నంటాయి. ముఖ్యఅతిథిగా రాజంపేట ఏఎస్పీ మనోజ్‌ రామ్‌నాథ్‌ హెగ్డే, చిత్తూరు ఏ ఎస్పీ శివానందకిషోర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్‌నాథ్‌ హెగ్డే మాట్లాడుతూ దేశ అభివృద్ధికి విద్యార్థులు కీలకమన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్య ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్నారు. వి ద్యా ర్థులకు ఇలాంటి వాతావరణాన్ని కల్పించడం హర్షదాయకమని స్కూ ల్‌ యాజమాన్యాన్ని అభినందించారు. ఏఎస్పీ శివానందకిషోర్‌ అకడమిక్‌ టాపర్స్‌కు, క్రీడల్లో విజయం సాధించిన విద్యార్థులకు మెడల్స్‌ బహుకరించారు. చైర్మన శరతకుమార్‌రాజు, సీఈవో శంకర్‌రాజు, ఎండీ కొండూరు భరతకుమార్‌రాజు, ప్రిన్సిపాల్‌ విజయనిర్మల, బీవీఎన పాఠశాల ప్రిన్సిపాల్‌ రాము, వైస్‌ ప్రిన్సిపాల్‌ జయశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 11:53 PM