Share News

భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:28 AM

భక్తులు వైకుంఠ ఏకాదశి వేడుక లను శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించా రు. స్వామివారిని వైకుంఠ ద్వారదర్శనం చే సుకొని పునీతులయ్యారు.

భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి
ఒంటిమిట్టలో.. ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై దర్శనమిస్తున్న సీతారామ లక్ష్మణులు

ఊరూవాడా వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

రాయచోటిటౌన్‌/ఒంటిమిట్ట/నందలూరు, జ నవరి 10: భక్తులు వైకుంఠ ఏకాదశి వేడుక లను శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించా రు. స్వామివారిని వైకుంఠ ద్వారదర్శనం చే సుకొని పునీతులయ్యారు. నిర్వాహకులు వేకు వజాము నుంచి ప్రత్యేక పూజలు, అలంకారా లు, పట్టువస్ర్తాలు సమర్పించి భక్తులకు దర్శ నభాగ్యం కల్పించారు. ముఖ్యంగా ఆంధ్ర అ యోధ్యగా పేరుగాంచిన కోదండ రామాల యంలో, నందలూరు సౌమ్యనాథస్వామి ఆల యంలో భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో కిటకిటలాడారు. జిల్లా కేంద్రమై న రాయచోటి పట్టణంలోని మాసాపేటలో గ ల లక్ష్మివెంకటేశ్వరస్వామి ఆలయంలో ఏకాద శి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఒంటిమిట్టలో...

ఏకశిలా నగరి కోదండరామాలయంలో ము క్కోటి వేడుకలను వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం 4.30 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ఉత్తర ద్వారంలో ఐదు గంటలకు గరుడ వాహనంపై ఉత్సవ మూర్తులైన సీతా రామ లక్ష్మణులను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంత రం బాలలయ ఉత్సవ మూర్తులైన సీతారా మ లక్ష్మణులను దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షాలను పొందారు.

భక్తులకు బాదంపాలు, అన్నదానం వితరణ

వేకువజామున రామాలయానికి వచ్చే భక్తులకు బాదంపాలు పంపిణీ చేపట్టారు. ఉదయం నుంచి స్థానిక ఆవరణంలో అన్న దాన కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించా రు. వీటితో పాటు స్థానిక వీరాంజనేయస్వా మి గుడి వద్ద పెద్దఎత్తున అన్నదానంతో పా టు చెక్కభజన కార్యక్రమాన్ని నిర్వహించారు.

గరుడవాహనంపై రామయ్య

వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్థానిక కోదం డరామాలయంలో ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై ఉన్న స్వామివారు ఉదయం 9 గంటలకు ఉత్తర ద్వారం గుండా, పురవీధుల గుండా భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై సీతారామ లక్ష్మణులకు గ్రామం లో భక్తులు పెద్దఎత్తున కాయకర్పూరం సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామోత్సవం వెంట టీటీడీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌, టీటీడీ సిబ్బంది నాయక్‌, ప్రవీణ్‌, వినోద్‌, అర్చకులు వీర రాఘవాచార్యులు, పవన్‌కు మార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 12:28 AM