Kethireddy: ప్రైవేట్ జెట్ నడిపిన కేతిరెడ్డి.. వీడియో వైరల్
ABN , Publish Date - Mar 31 , 2025 | 01:10 PM
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కొత్త అవతారం ఎత్తారు. ప్రైవేట్ జెట్ నడిపి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతోంది.

హైదరాబాద్: వైసీపీ పార్టీ కీలక నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. నయ అవతారం ఎత్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నేతల్లో కేతిరెడ్డి ఒకరు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు.. తన నియోజకవర్గం, పార్టీ సమావేశాలు, ఇతర కార్యక్రమాల గురించి తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేవారు. 2024 ఎన్నికల్లో కూటమి గాలికి కొట్టుకుపోయారు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఇలా ఉండగా.. తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఒక పర్సనల్ వీడియో షేర్ అందరిని ఆశ్చర్యపరిచారు కేతిరెడ్డి. ఆవివరాలు..
కేతిరెడ్డి తాజాగా పైలట్ అవతారం ఎత్తారు. తానే స్వయంగా ప్రైవేట్ జెట్‌ని నడిపిన వీడియోని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కల నిజమయ్యింది అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 'కల నిజమైంది. అధికారికంగా పైలట్ అయ్యా. ఇది ప్రారంభం మాత్రమే. ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఇలాంటి సాహసాలు మరెన్నో ఉన్నాయి' అని ఆయన ట్వీట్ చేశారు.
హైదరాబాద్ పరిసరాల్లో ప్రైవేట్ జెట్ నడిపి తన కల నెరవేర్చుకున్నారు కేతిరెడ్డి. ఇది చూసిన ఆయన అభిమానులు.. మీరు నిజంగా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
హైదరాబాద్-విజయవాడ ప్రయాణికులకు శుభవార్త.. భారీగా తగ్గిన టోల్ ట్యాక్స్
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..