Share News

నాక్‌ కేసులో నిందితులకు షాక్‌

ABN , Publish Date - Feb 18 , 2025 | 05:46 AM

ఏ ప్లస్‌ ప్లస్‌ గుర్తింపు కోసం నాక్‌ (నేషనల్‌ అసె్‌సమెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌) అధికారులకు లంచాలు ఇచ్చి జైలు పాలైన కేఎల్‌ యూనివర్సిటీ ప్రతినిధులు, అధ్యాపకులకు షాక్‌ తగిలింది.

నాక్‌ కేసులో నిందితులకు షాక్‌

కేఎల్‌ వర్సిటీ ప్రతినిధులు, అధ్యాపకులకు బెయిల్‌ను తిరస్కరించిన సీబీఐ కోర్టు

విజయవాడ, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : ఏ ప్లస్‌ ప్లస్‌ గుర్తింపు కోసం నాక్‌ (నేషనల్‌ అసె్‌సమెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌) అధికారులకు లంచాలు ఇచ్చి జైలు పాలైన కేఎల్‌ యూనివర్సిటీ ప్రతినిధులు, అధ్యాపకులకు షాక్‌ తగిలింది. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను విజయవాడ సీబీఐ కోర్టు సోమవారం తిరస్కరించింది. కొద్దిరోజుల క్రితం ఈ కేసులో సీబీఐ పది మంది నిందితులను అరెస్టు చేసింది. ఇందులో నాక్‌ అధికారులతోపాటు కేఎల్‌ వర్సిటీ ప్రతినిధులు, అధ్యాపకులు కూడా ఉన్నారు.

Updated Date - Feb 18 , 2025 | 05:46 AM