Share News

రాజధాని రైతులకు

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:12 AM

అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన 15 గ్రామాలకు చెందిన 197 మంది రైతులకు గురువారం విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో ఈ లాటరీ విధానం ద్వారా 494 రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించారు.

రాజధాని రైతులకు

విజయవాడ కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి) : అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన 15 గ్రామాలకు చెందిన 197 మంది రైతులకు గురువారం విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో ఈ లాటరీ విధానం ద్వారా 494 రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 297 నివాస ప్లాట్లు కాగా 197 వాణిజ్య ప్లాట్లు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నవులూరు, కురగల్లు, నిడమర్రు, పెనుమాక, నెక్కల్లు, అనంతవరం రైతులకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు రాయపూడి, వెంకటపాలెం, వెలగపూడి, మంద డం, దొండపాడు, పిచ్చుకలపాలెం, ఐనవోలు, లింగాయపాలెం, ఉద్దండరాయనిపాలెం గ్రామ రైతులకు ఈ లాటరీ విధానంలో ఆన్‌లైన్‌ ర్యాండమ్‌ సిస్టం ద్వారా ప్లాట్లను కేటాయించారు. రిటర్నబుల్‌ ప్లాట్లు పొందిన రైతులకు సీఆర్‌డీఏ అధికారులు ప్రొవిజినల్‌ సర్టిఫికెట్లు అందచేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ల్యాండ్స్‌ విభాగం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (ల్యాండ్‌ అక్విజేషన్‌) ఎన్‌ఎ్‌సవీబీ వసంతరాయుడు మాట్లాడుతూ, ప్లాట్లు పొందిన రైతులకు భౌగోళికంగా వారి ప్లాట్లు ఎక్కడ కేటాయించవడ్డాయో వివరించడానికి ప్రత్యేకంగా జీఐఎస్‌ సిబ్బంది, గ్రామ సర్వేయర్లను నియమించామన్నారు. రిటర్నబుల్‌ ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు జి.భీమారావు, ఎం.శేషిరెడ్డి, జి.రవీందర్‌, ఏజీ చిన్ని కృష్ణ, పి.పద్మావతి, జి.రవీందర్‌, కె.స్వర్ణమేరీ, బి.సాయిశ్రీనివాస నాయక్‌, కె.ఎ్‌స.భాగ్యరేఖ, సీఆర్‌డీఏ ప్రిన్సిపల్‌ ప్లానర్‌ ఆర్‌.నాగేశ్వరరావు, సీఆర్‌డీఏ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 01:12 AM