పాకిస్థాన్‌లో ఉన్న త్రివిధ దళాలను శిబిరాలను ధ్వంసం చేశామని గవర్నర్ కంభంపాటి హరిబాబు తెలిపారు. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు ఉందని వెల్లడించారు. మన దేశంలో రక్షణ పరికరాలను కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామని వివరించారు.
అరెస్టు భయంతో హైకోర్టును మాజీ ఎమ్మెల్యే వంశీ ఆశ్రయించారు. పోలీసులు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌ను లంచ్ మోషన్‌గా విచారణ చేయాలని అభ్యర్థించారు.
రికార్డు స్థాయిలో కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారి 11 ట్రైన్లు పెట్టి ధాన్యం ఇతర జిల్లాలకు తరలించారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణా జిల్లాలో పర్యటించిన మంత్రి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సాంకేతికత సాయంతో ప్రైవేట్ కొరియర్ సర్వీసులకు ధీటుగా పోస్టాఫీసులను తయారు చేస్తున్నామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విట్ వర్సిటీలో జెన్ జెడ్ పోస్టాఫీసును కేంద్రమంత్రి ప్రారంభించారు.
ఏపీ వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ , ప్రైవేటు, గురుకులాలు, వసతి గృహాలు, కళాశాలల్లో తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది.
తన జేబులో ఉన్న డబ్బుతో మద్యం షాపు కనిపించిన ప్రతిచోట ఆగి, తాగాడు. అర్ధరాత్రి అవుతున్నా ఇంకా తాగాలనిపించింది. అయితే ఈసారి మద్యం కొనేందుకు రూ.10 తగ్గాయి. ఆ డబ్బు ఇవ్వమని ఓ వ్యక్తిని అడగ్గా.. అతను ఇవ్వలేదని కిరాతకంగా హత్య చేశాడు. నగరంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో నిందితుడు, బాధితుడు ఇద్దరూ మద్యం మత్తులోనే ఉండడం గమనార్హం.
శిశువుల విక్రయంలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ముఠాతో విజయవాడ గ్యాంగ్‌కు ఉన్న సంబంధంతోనే శిశువులు ఇక్కడికి వస్తున్నట్టు తేలింది. ముఠాను నడుపుతున్న బలగం సరోజినికి శిశువులను విక్రయిస్తున్న ఢిల్లీకి చెందిన కిరణ్‌శర్మ, భారతిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
‘విజయవాడ విమానాశ్రయం అభివృద్ధి కోసం భూసమీకరణకు భూములివ్వండి.. రాజధాని అమరావతిలో ప్యాకేజీ కల్పిస్తాం’ అంటూ సీఆర్‌డీఏ మాటలు నమ్మి రైతుల వద్ద భూములు కొన్న ప్రైవేట్ వ్యక్తులు నిండా మునిగిపోయారు. గన్నవరం మండలం అజ్జంపూడి గ్రామంలో రైతుల నుంచి 52.74 ఎకరాలు కొన్న ప్రైవేట్ వ్యక్తులు అటు రాజధానిలో ప్యాకేజీ అందక, కౌలు లభించక పదేళ్లుగా అష్టకష్టాలు పడుతున్నారు.
మాజీ సీఎం జగన్‌పై దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పులివెందుల మెడికల్ కాలేజీకి రూ.481 కోట్లు ఖర్చు చేసిన జగన్.. పాడేరు, పార్వతిపురం కాలేజీలకు ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కూటమి ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి ఎంపీలకు కీలక సూచనలు చేశారు.