ఏసీబీకా.. సీఐడీకా!
ABN , Publish Date - Apr 18 , 2025 | 01:04 AM
శాప్ ఇంజనీరింగ్ అధికారి కేసును ఏం చేద్దాం.. విజిలెన్స్‌కు ఇచ్చేద్దామా..ఏసీబీకి అప్పగిద్దామా? పోలీసుల ముందు ఉన్న ప్రశ్నలు ఇవి.
శాప్ ఇంజనీరింగ్ అధికారి కేసులో పోలీసుల ఆలోచన
నిత్యం వివరాలు సేకరిస్తున్న రెండు విభాగాలు
మహిళ పేరున ఉన్న భూముల వివరాలివ్వాలని రిజిస్ట్రార్‌కు లేఖ
విజయవాడ, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): శాప్ ఇంజనీరింగ్ అధికారి కేసును ఏం చేద్దాం.. విజిలెన్స్‌కు ఇచ్చేద్దామా..ఏసీబీకి అప్పగిద్దామా? పోలీసుల ముందు ఉన్న ప్రశ్నలు ఇవి. శాప్‌లోని ఒక ఇంజనీరింగ్ అధికారికి, నందిగామలో ఒక మహిళకు మధ్య జరుగుతున్న ఆస్తుల వివాదం కేసులో కోట్లలో లావాదేవీలకు సంబంధించి వివరా లు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. కొట్లాట కేసుగా నమో దు చేసిన పోలీసులు ఫిర్యాదురాలికి సంబంధించిన మొత్తం నగదు లావాదేవీలను గుర్తించారు. ఫిర్యాదు చేసిన మహిళ, ఆమె తల్లి పేరు మీద ఉన్న ఆరు బ్యాంకు ఖాతాల్లో రూ.9 కోట్లు ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు. ఎక్కడెక్కడ నుంచి ఏఏ మార్గాల్లో ఈ నిధులు వచ్చా యో తెలుసుకుంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ ఆమె ఖాతాకు రూ.2 కోట్లు బదిలీ చేసినట్టు మూడు రోజుల క్రితం నిర్ధారించారు. ఆ ఒక్క కాంట్రాక్టరే కాకుండా శ్రీకాకుళం, అమలాపు రం, విజయవాడకు చెందిన కాంట్రాక్టర్లు ఆ మహిళ ఖాతాలకు డబ్బు లు పంపినట్టు సమాచారం. తవ్వే కొద్దీ ఇందులో ఒక్కో మూలం బయటకు వస్తుండడంతో పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మొత్తం కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకపక్క ఏసీబీ అధికారులు, మరో పక్క సీఐడీ అధికారులు ఈ కేసు గురించి పోలీసులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను మొత్తం ఏసీబీకి గానీ, సీఐడీకి గానీ ఇచ్చేదామన్న యోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇంజనీరింగ్ అధికారిపై ఫిర్యాదు చేసిన మహిళ పేరు మీద ఉన్న భూముల వివరాలను మొత్తం ఇవ్వాలని పోలీసులు రిజిస్ట్రేషన్ అధికారులకు లేఖలు రాశా రు. అధికార పార్టీ నాయకులు పోలీసు అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ఎవరెవరు తలదూర్చుతున్నారన్న వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.