Share News

దేశానికి క్రీడా రాజధానిగా అమరావతి

ABN , Publish Date - Apr 19 , 2025 | 01:15 AM

రాబోయే కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం క్రీడాంధ్రపదేశ్‌ కావడంతో పాటు రాజధాని అమరావతి ప్రాంతం దేశానికే క్రీడా రాజధానిగా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) అన్నారు.

దేశానికి క్రీడా రాజధానిగా అమరావతి
మూలపాడులో అమరావతి జర్నలిస్టు క్రికెట్‌ లీగ్‌ పోటీల ప్రారంభం సందర్భంగా కేక్‌ కట్‌ చేస్తున్న ఎంపీ కేశినేని చిన్ని

సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని ఎంపీ కేశినేని చిన్ని ఆశాభావం

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): రాబోయే కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం క్రీడాంధ్రపదేశ్‌ కావడంతో పాటు రాజధాని అమరావతి ప్రాంతం దేశానికే క్రీడా రాజధానిగా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) అన్నారు. మూలపాడులో ఏసీఏ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించే అ మరావతి జర్నలిస్టు క్రికెట్‌ లీగ్‌ పోటీలను శుక్రవారం శాప్‌ చైర్మన్‌ రవి నాయుడితో కలిసి ఆయన ప్రారంభించారు. కేశినేని ఫౌండేషన్‌, ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌, శాప్‌ సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ప ది టీమ్‌లు తపడుతున్నాయి. టోర్నమెంట్‌ను ఎంపీ ప్రారంభించారు. జాతీయ పోటీల నిర్వహణకు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఏపీకి ఐపీఎల్‌ టీమ్‌ కూడా ఏర్పాటు కానుందని స్పష్టం చేశారు. మూలపాడు ప్రాంతంలోనే స్పోర్ట్స్‌ సిటీ, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నెలకొల్పేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ కృషి చేస్తున్నారని, అ త్యుత్తమ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం అభివృద్ధికి ఐసీసీ చైర్మన్‌ జైషా హామీ ఇచ్చారని తెలిపారు. సెలవుల్లో 5 లక్షల మంది పిల్లలకు వేసవి శి క్షణ ఇప్పిస్తున్నట్లు శాప్‌ చైర్మన్‌ రవి నాయుడు తెలిపారు. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ కోశాధికారి దండమూడి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

తలపడిన జట్లు..

మూలపాడులోని ఏసీఏ స్టేడియంలోని ఏ గ్రౌండ్‌లో ఉదయం జరిగిన తొలి మ్యాచ్‌లో ఐ అండ్‌ పీఆర్‌ టీమ్‌పై విజయవాడ మీడియా టీం విజయం సాదించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఐ అండ్‌ పీఆర్‌ టీం 89 పరుగులకు ఆలౌట్‌ కాగా, విజయవాడ మీడియా జట్టు మూడు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. బీ గ్రౌండ్‌లో సచివాల యం ఎలకా్ట్రనిక్‌ మీడియా, కేబుల్‌ టీవీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేబుల్‌ టీవీ జట్టు గెలుపొందింది. మధ్యాహ్నం ఏ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో సచివాలయం ప్రింట్‌ మీడియా టీమ్‌పై అమరావతి మీడి యా జట్టు విజయం సాధించింది.

రాజధాని మీడియా జట్టు ఘన విజయం

బీ గ్రౌండ్‌లో మధ్యాహ్నం సచివాలయం కెమెరామెన్‌ జట్టు, రాజధా ని మీడియా జట్టు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజధాని మీడియా జట్టు ఏడు వికెట్ట నష్టానికి 154 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన సచివాలయం కెమెరామెన్‌ జట్టు 51 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. ఈ మ్యాచ్‌లో రాజధాని మీడియా జట్టు 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Updated Date - Apr 19 , 2025 | 01:15 AM