క్రైస్తవుల శిలువ యాత్రలు
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:59 AM
ఈస్టర్‌ను పురస్కరించుకుని శుక్రవారం వన్‌టౌన్‌లో గుడ్‌ఫ్రైడే క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
వన్‌టౌన్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ఈస్టర్‌ను పురస్కరించుకుని శుక్రవారం వన్‌టౌన్‌లో గుడ్‌ఫ్రైడే క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వన్‌టౌన్ ఆర్‌సీఎం చర్చి, సీఎస్‌ఐ, తెలుగు బాప్టిస్ట్ చర్చి, బైబిల్ మిషన్ చర్చి, విద్యాధరపురం అంబేడ్కర్ రోడ్డులోని సీఎస్‌ఐ చర్చి, భవానీపురం బైపాస్ రోడ్డు లోని ఆర్‌సీఎం చర్చిల ఆధ్వర్యంలో శిలువధారణ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వురు ఫాదర్‌లు మాట్లాడుతూ కరుణాసముద్రుడైన ఏసు క్రీస్తు శిలువపై నిలబడి ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని అందించారన్నారు. కార్యక్ర మంలో ఆర్‌సీఎంచర్చి ఫాదర్ విజయకుమార్ ప్రతినిధులు పాల్గొన్నారు.
కేదారేశ్వరపేట : పెజ్జోనిపేట ఆర్‌సీఎం చర్చిలో గుడ్‌ఫ్రైడేలో భాగంగా పురవీధుల్లో శిలువమార్గం చేపట్టారు. క్రీస్తుకు విధించిన శిలువ శిక్షను, పురవీధుల్లో ఆ విధంగా క్రైస్తవులు ఆ వేషధారణలు ధరించి శిలువమార్గాన్ని చేపట్టారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పెజ్జోనిపేట ఆర్‌సీఎం చర్చి ఫాదర్ జేమ్స్, సహాయ గురువులు సౌరిల్, మ్యాథ్యూ, జీవన్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సత్యనారాయణపురం : అంబేడ్కర్ కాలనీలో సియోను ప్రార్థన మందిరంలో గుడ్‌ఫ్రైడే భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్బంగా డాక్టర్ కనమాల వరప్రసాద్ మాట్లాడుతూ క్రీస్తు మానవాళికోసం ఆయన శిలువ వేయబడిన రోజన్నారు. దేవుడు తన స్వారూప్యంలో మానవులను సృష్టించుకున్నారన్నారు. క్రీస్తు చేసిన త్యాగాలను తెలుసుకొని సన్మార్గంలో నడవాలని సూచించారు. మానవాళి కోసం ఏసు ప్రభువుల వారు చేసిన త్యాగాలను స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.