రూ.10 కోట్లతో కలెక్టరేట్‌లో సమావేశ మందిరం
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:31 AM
కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో రూ.10 కోట్ల అంచనాలతో సమావేశ మందిరాన్ని నిర్మిస్తామనని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు.

మచిలీపట్నం, మార్చి 29(ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో రూ.10 కోట్ల అంచనాలతో సమావేశ మందిరాన్ని నిర్మిస్తామనని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో సమావేశ మందిరం నిర్మించే ప్రాం తాన్ని ఎంపిక చేసేందుకు కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి ఆయన కలెక్టరేట్ ప్రాంగణాన్ని పరిశీలిం చారు. 200 ఏళ్ల క్రితం బ్రిటీష్ పాలకులు కలెక్టరేట్‌ను మచిలీపట్నంలో నిర్మించారని అన్నారు. కలెక్టరేట్‌లో వివిధసమావేశాలు నిర్వహించాలంటే సమావేశపు మందిరం సరిపోవడం లేదన్నారు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కేంద్రప్రభుత్వ నిధులతో కలెక్టరేట్‌లో అత్యంత అధునాతన మైన సమావేశపు మందిరాన్ని నిర్మించాలని ఆలోచన చేస్తున్నామని ఎంపీ బాలశౌరి తెలి పారు. ఈ పరిశీలన కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ పాల్గొన్నారు.