Share News

బందరు కాలువలో మృతదేహం

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:41 AM

గేదెలు మేపడానికి వెళ్లి ఈనెల 21వ తేదీన బందరు కాలువలో గల్లంతైన కూచిపూడి రాజారావు(59) మృతదేహాన్ని గురువారం గుర్తించారు.

బందరు కాలువలో మృతదేహం

తోట్లవల్లూరు, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): గేదెలు మేపడానికి వెళ్లి ఈనెల 21వ తేదీన బందరు కాలువలో గల్లంతైన కూచిపూడి రాజారావు(59) మృతదేహాన్ని గురువారం గుర్తించారు. పమిడిముక్కల మండలం శ్రీరంగపురానికి చెందిన రాజారావు ఎనిమిదేళ్లుగా వల్లూరుపాలెంలో కుమా ర్తె బందెల కరుణ వద్ద ఉంటున్నాడు. రోజూ గేదెల ను మేపుకొస్తాడు. 21వ తేదీన గేదెలు మేపేందుకు వెళ్లిన రాజారావు తిరిగి ఇంటికి రాకపోవటంతో 22వ తేదీన కుమార్తె కరుణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని తీసుకొచ్చి బందరు కాలువలో గా లింపు చేపట్టారు. గురువారం కాలువలో రాజారావు మృతదేహాన్ని గుర్తించారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

Updated Date - Apr 25 , 2025 | 12:41 AM