మండుటెండలో న్యాయవాది నిరసన దీక్ష
ABN , Publish Date - Apr 19 , 2025 | 11:58 PM
సిటీ సివిల్ కోర్టుల ముందు శనివారం మధ్యాహ్నం మండుటెండలో యువ మహిళా న్యాయవాది తుమ్మూరు మణిప్రియ నిరసన దీక్ష చేపట్టారు.
తనపై దాడిచేసిన న్యాయవాదులను అరెస్టు చేయాలని మణిప్రియ డిమాండ్
విజయవాడ లీగల్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): సిటీ సివిల్ కోర్టుల ముందు శనివారం మధ్యాహ్నం మండుటెండలో యువ మహిళా న్యాయవాది తుమ్మూరు మణిప్రియ నిరసన దీక్ష చేపట్టారు. తనపై గురువారం దాడికి పాల్పడిన న్యాయవాదులు పిట్ల శ్రీను, సౌందర్యపై కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో జరిగిన వివాదాన్ని పరిష్కరించేందుకు బార్ అధ్యక్ష, కార్యదర్శులు చాంబర్‌కు తనను పిలిపించారని, తాను జరిగిన విషయాన్ని చెబుతుండగా పిట్ల శ్రీను, సౌందర్య, పేరు తెలియని మరికొందరు న్యాయవాదులు తనపై దాడికి పాల్పడ్డారని, తనను కోర్టులోకి రానివ్వబోమని బెదిరించారని తెలిపారు. అంతేకాక కమిటీ వేస్తున్నామని చెబుతున్నారని, ఆ కమిటీలపై తనకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. తనపై దాడికి పాల్పడ్డ న్యాయవాదులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపే వరకు తన నిరసన తెలియజేస్తానని తెలిపారు.