Lokesh Congratulates Akhil: 11ఏళ్ల టెక్ పిడుగు అఖిల్‌కు మంత్రి లోకేష్ అభినందనలు
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:47 PM
Lokesh congratulates Akhil: 11 ఏళ్ల టెక్ పిడుగు అఖిల్‌ను మంత్రి నారా లోకేష్ అభినందించారు. మున్ముందు అఖిల్ మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి అన్నారు.

అమరావతి, మార్చి 28: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను (Minister Nara lokesh) 11 ఏళ్ల టెక్ పిడుగు అఖిల్ ఆకెళ్ల (Akhil Akella) కలిశారు. ఈ సందర్భంగా టెక్నాలజీలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్న అఖిల్‌ను మంత్రి అభినందించారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం ఉండవల్లిలోని నివాసంలో తన తండ్రితో కలిసి మంత్రి లోకేష్‌ను అఖిల్ కలుసుకున్నారు. 11 ఏళ్ల అఖిల్ యూకేలో విద్యను అభ్యసిస్తున్నారు. చిన్న వయసులోనే టెక్నాలజీ రంగంలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నాడు అఖిల్. ఈ రంగంలో ఎన్నో మైలురాళ్లను సాధించాడు.
అఖిల్‌కు మైక్రోసాఫ్ట్ ధృవీకరించిన అజ్యూర్, డేటా, సెక్యూరిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫౌండేషన్ కోర్సుల్లో సర్టిఫికేషను పొందారు. యూకేలో నిర్వహించిన పలు టెక్ సమ్మిట్‌లలో చిన్నారి పాల్గొన్నారు. అమరావతిలో జరుగనున్న సమాచార, సాంకేతిక అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు అఖిల్ ఆసక్తి కనబర్చడంతో త్వరలోనే కలుస్తానని గతంలో మంత్రి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అఖిల్‌ను కలిసిన మంత్రి.. టెక్నాలజీలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నందుకు చిన్నారిని అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి...
Youth Firing Gun: అర్ధరాత్రి కారులో వెళ్తూ ఆ యువకులు చేసిన పని తెలిస్తే
Young Man Killed: పుట్టినరోజు నాడే కిరాతకం.. యువకుడి దారుణ హత్య
Read Latest AP News And Telugu News