Share News

కోల్డ్‌ స్టోరేజీ సమస్య కొలిక్కి

ABN , Publish Date - Mar 30 , 2025 | 12:48 AM

అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన సాయి తిరుమలగిరి కోల్డ్‌ స్టోరేజీ రైతులను ఆదుకునేందుకు ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య చొరవ తీసుకున్నారు. శనివారం రాత్రి జగ్గయ్యపేట మారె ్కట్‌ యార్డులో కంపెనీ యాజమాన్యం, రైతులతో జరిపిన చర్చలు సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కోల్డ్‌ స్టోరేజీ సమస్య కొలిక్కి

యాజమాన్యం, రైతులతో ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య చర్చలు

మార్కెట్‌ ధర చెల్లించేందుకు యాజమాన్యం సూత్రప్రాయంగా అంగీకారం

జగ్గయ్యపేట, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన సాయి తిరుమలగిరి కోల్డ్‌ స్టోరేజీ రైతులను ఆదుకునేందుకు ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య చొరవ తీసుకున్నారు. శనివారం రాత్రి జగ్గయ్యపేట మారె ్కట్‌ యార్డులో కంపెనీ యాజమాన్యం, రైతులతో జరిపిన చర్చలు సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగ్గయ్యపేట తహసీల్దార్‌ మనోహర్‌, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.వెంకటేశ్వర్లు, ఏఎంసీ కార్యదర్శి ఎన్వీ నరసింహారావు సమక్షంలో కోల్డ్‌ స్టోరేజీ తరఫున హరి నరసింహారావు, పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులతో చర్చలు జరిపారు. తొలుత రైతులు మాట్లాడుతూ తాము కోల్డ్‌ స్టోరేజీలో పంటలు ఉంచిన సమయంలో ఉన్న మార్కెట్‌ ధర చెల్లించాలని కోరగా, మరికొంతమంది ధర పెరిగినందున ప్రస్తుత మార్కెట్‌ ధర చెల్లించాలని ప్రతిపాదించారు. సరాసరి ధర చెల్లించటం వల్ల మెజారిటీ రైతులకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. తేజా రకానికి అత్యధికంగా, తాలు రకానికి తక్కువ ధర చెల్లించేలా అంగీకారం కుదిరింది. ఎక్నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్‌ల ఆధారంగా రైతులు తీసుకున్న రుణాలు పోను తుది మొత్తాన్ని లెక్క తేల్చాక ఎప్పుడు చెల్లించాలనే విషయమై స్పష్టత ఇస్తామని యాజమాన్య ప్రతినిధి చెప్పారు.

Updated Date - Mar 30 , 2025 | 12:48 AM