Share News

ఇంటర్‌లో ప్రవేశాలకు ప్రధానోపాధ్యాయులు సహకరించాలి

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:37 AM

జిల్లాలోని ప్రభు త్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులు సహకరించాలని జిల్లా ఇంటర్మీడియట్‌ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి పి.బి.సాల్మన్‌రాజు కోరారు.

ఇంటర్‌లో ప్రవేశాలకు ప్రధానోపాధ్యాయులు సహకరించాలి
మాట్లాడుతున్న ఇంటర్మీడియట్‌ జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి సాల్మన్‌రాజు

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభు త్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులు సహకరించాలని జిల్లా ఇంటర్మీడియట్‌ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి పి.బి.సాల్మన్‌రాజు కోరారు. సోమవారం లేడీయాంప్తిల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగులు ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది నుంచి ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారని, ఎంసెట్‌ మెటిరీయల్‌ ఉచితంగా ఇస్తున్నారని తెలిపారు. ప్రిన్సిపాల్‌ సుందరలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 12:37 AM