Share News

రేగుల అనురాధ పాఠశాల అప్‌గ్రేడ్‌కు కృషి చేస్తా

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:33 AM

రేగుల అనురాధ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల అ్‌ప్‌ గ్రేడ్‌కు కృషి చేస్తానని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ హామీ ఇచ్చారు.

రేగుల అనురాధ పాఠశాల అప్‌గ్రేడ్‌కు కృషి చేస్తా
పాఠశాల ఉపాధ్యాయులు, కార్పొరేటర్‌ జాస్తి సాంబశివరావు, పెద్దలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

రేగుల అనురాధ పాఠశాల అప్‌గ్రేడ్‌కు కృషి చేస్తా

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

భారతీనగర్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): రేగుల అనురాధ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల అ్‌ప్‌ గ్రేడ్‌కు కృషి చేస్తానని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ హామీ ఇచ్చారు. తూర్పు పరిధి ఏపీఐఐసీ కాలనీలోని రేగుల అనురాధ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలను బుధవారం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేగుల అనురాధ నగరపాలక సంస్థ పాఠశాలను పదో తరగతి వరకు పెంచడం వల్ల స్థానికంగా ఉండే అపార్టుమెంట్‌ వాసులకు, సమీప కాలనీల్లోని, ఆటోనగర్‌ పరిసర ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి లోకేష్‌, విద్యాశాఖ కమిషనర్‌ శశిధర్‌తో స్వయంగా మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం జరిగేలా చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ జాస్తి సాంబశివరావు, స్కూల్‌ హెచ్‌ఎం.సుజాత, టీడీపీ నేత గొల్లపూడి నాగేశ్వరరావు, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 12:33 AM