Share News

చిరు వ్యాపారులకు రక్షణ కల్పించాలి

ABN , Publish Date - Apr 17 , 2025 | 01:05 AM

50 సంవత్సరాలుగా బీసెంట్‌ రోడ్డులో చిరు వ్యాపారాలు చేసు కుంటూ జీవనం సాగిస్తున్న వారిపై అధికారపార్టీ నేతలు బెదిరిస్తూ వారి జీవనోపాధిని దెబ్బతీయాలని చూస్తున్నా రని సీఐటీయూ జిల్లా నాయకుడు దోనేపూడి కాశీనాథ్‌ అన్నారు.

 చిరు వ్యాపారులకు రక్షణ కల్పించాలి
సీఐటీయూ ఆధ్వర్యంలో బీసెంట్‌ రోడ్డులో నిరసన

గవర్నర్‌పేట, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): 50 సంవత్సరాలుగా బీసెంట్‌ రోడ్డులో చిరు వ్యాపారాలు చేసు కుంటూ జీవనం సాగిస్తున్న వారిపై అధికారపార్టీ నేతలు బెదిరిస్తూ వారి జీవనోపాధిని దెబ్బతీయాలని చూస్తున్నా రని సీఐటీయూ జిల్లా నాయకుడు దోనేపూడి కాశీనాథ్‌ అన్నారు. చిరువ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీపై రుణాలు మంజూరు చేయించాలంటూ బుధవారం బీసెంట్‌ రోడ్డులోని అన్సారీ పార్కు ఎదురు విజయవాడ హాకర్స్‌ అండ్‌ తోపుడుబండ్ల యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అధికార పార్టీ నేతల చర్యలను నిరసిస్తూ కె.దుర్గారావు మాట్లాడారు. ఎన్నికల ముందు చిరు వ్యాపారులకు రక్షణ కల్పిస్తా మని, అధికారంలోకి రాగానే దౌర్జన్యాలకు దిగడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. కార్యక్రమంలో వై. సుబ్బారావు, బాలబొమ్మ లక్షణ, బెవర వెంకటేశ్వరరావు, సీహెచ్‌ మురళీ, బెవర శ్రీను, ఎస్‌కే మస్తాన్‌, వై. స్రవంతి, సూరమ్మ, బి. లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 01:05 AM