Share News

ప్రజాదర్బార్‌ వేదికగా సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Apr 17 , 2025 | 01:08 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్‌ వల్ల పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే శ్రీరామ్‌ రాజగోపాల్‌ అన్నారు.

 ప్రజాదర్బార్‌ వేదికగా సమస్యల పరిష్కారం
కంచికచర్ల ప్రజాదర్బార్‌లో అర్జీలు స్వీకరిస్తున్న తంగిరాల సౌమ్య

పెనుగంచిప్రోలు /కంచికచర్ల రూరల్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్‌ వల్ల పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే శ్రీరామ్‌ రాజగోపాల్‌ అన్నారు. జమ్మిచెట్టు రామాలయం వద్ద బుధవారం టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చింతల వెంకట సీతారామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. మొత్తం 112 అర్జీలు ప్రజలు సమర్పించారు. సీడీపీవో లక్ష్మి భార్గవి ఆధ్వర్యంలో మండల పరిషత కార్యాలయంలో పౌష్టికాహార పక్షోత్సవాల్లో ఆయన పాల్గొని గర్భిణులను ఆశీర్వదించి చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. కూటమి నేతలు కర్ల వెంకట నారాయణ, కాకాని శ్రీనివాసరావు, గజ్జి కృష్ణ మూర్తి, వేగినేటి గోపాలకృష్ణ మూర్తి, జిల్లేపల్లి సుధీర్‌బాబుపాల్గొన్నారు.

ఫ కంచికచర్ల పంచాయతీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తుందని ఆమె అన్నారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ వేల్పుల సునీత, ఎంపీడీవో బీఎం లక్ష్మికుమారి, తహసీల్దార్‌ మానస, మండల టీడీపీ అధ్యక్షుడు కోగంటి బాబు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 01:08 AM