Share News

టీడీపీ కార్యాలయంపై రాళ్లదాడి

ABN , Publish Date - Apr 19 , 2025 | 01:13 AM

నందిగామలోని రైతుపేట టీడీపీ కార్యాలయంపై శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు.

టీడీపీ కార్యాలయంపై రాళ్లదాడి
పగిలిన కిటికీ అద్దాలు

నందిగామ రూరల్‌, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): నందిగామలోని రైతుపేట టీడీపీ కార్యాలయంపై శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. దీంతో కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సీఐ లచ్చునాయుడు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అకతాయిల పనా.. లేక రాజకీయ కోణంలో జరిగిందా అని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Updated Date - Apr 19 , 2025 | 01:13 AM