Share News

ఈ నెలాఖరుతో ముగియనున్న ఈ కేవైసీ గడువు

ABN , Publish Date - Apr 18 , 2025 | 01:12 AM

రేషన్‌ కార్డుల్లో ఈ కేవైసీ చేయించుకోవల్సిన వారికి ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఎన్టీఆర్‌ జిల్లాలో ఈకేవైసీ చేయించుకోవాల్సినవారు ఇంకా 1,25,049మంది ఉన్నారు. వీరిలో ఐదేళ్లలోపు వారు 22,834 మంది, 80 సంవత్సరాలు పైబడినవారు 1001 మంది ఉన్నారు. ఈ రెండు కేటగిరీల వారికి ఈ కేవైసీ అవసరం లేదు. మిగిలిన 1,01,214 మంది ఈ కేవైసీ చేయించుకోవాలి. మార్చి 31తో ముగిసిన గడువును ఎప్రిల్‌ 30 వరకు పొడి గించారు.

ఈ నెలాఖరుతో ముగియనున్న ఈ కేవైసీ గడువు

మొగల్రాజపురం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : రేషన్‌ కార్డుల్లో ఈ కేవైసీ చేయించుకోవల్సిన వారికి ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఎన్టీఆర్‌ జిల్లాలో ఈకేవైసీ చేయించుకోవాల్సినవారు ఇంకా 1,25,049మంది ఉన్నారు. వీరిలో ఐదేళ్లలోపు వారు 22,834 మంది, 80 సంవత్సరాలు పైబడినవారు 1001 మంది ఉన్నారు. ఈ రెండు కేటగిరీల వారికి ఈ కేవైసీ అవసరం లేదు. మిగిలిన 1,01,214 మంది ఈ కేవైసీ చేయించుకోవాలి. మార్చి 31తో ముగిసిన గడువును ఎప్రిల్‌ 30 వరకు పొడి గించారు.

2021లో నాటి ప్రభుత్వం ఇచ్చిన రైస్‌ కార్డుల్లో రెండు, మూడేళ్ల వయస్సు పిల్లలు తప్పనిసరిగా ఆధార్‌ సెంటర్‌లో వేలిముద్రలు నవీకరించుకోవలి. వారం రోజుల తర్వాత రేషన్‌ డీలర్‌ వద్దగాని, ఎండీయూ వాహనం వద్ద గాని ఈ కేవైసీ చేయించుకోవాలి. వీరు కాకుండా దీర్ఘకాలం రేషన్‌ తీసుకునే సమయంలో వేలిముద్ర వేయని వారిలో అత్యధిక శాతం ఆరు నుంచి పదేళ్ల వయస్సు వారు, ఉద్యోగాల నిమిత్తం వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి పేర్లు ఉంటాయి. ఇంటర్‌నెట్‌లో గూగుల్‌లో ఈపీడీఎస్‌1 అని టైప్‌ చేస్తే ఈపీడీఎ్‌స.ఏపీ.జీవోవి.1అని వస్తుంది. దీనిని ఒపెన్‌ చేస్తే పలు ఎంపికలు ఉంటాయి. వాటిలో రైస్‌ కార్డు సెర్చ్‌లోకి వెళ్లి మీ కార్డు నెంబరు టైప్‌ చేయాలి. కార్డు వివరాలు వస్తాయి. ఆ వివరాల్లో పేర్ల చివర ఈ కేవైసీ అయిందా లేదా అనే సమాచారం ఉంటుంది. అవ్వకపోతే వెంటనే ఈ కేవైసీ చేయించుకోవాలి.

Updated Date - Apr 18 , 2025 | 01:12 AM