Share News

ఇద్దరు జడ్జిల బదిలీ

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:36 AM

జిల్లా కోర్టులో పనిచేస్తున్న ఇద్దరు జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.

 ఇద్దరు జడ్జిల బదిలీ

మచిలీపట్నం, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): జిల్లా కోర్టులో పనిచేస్తున్న ఇద్దరు జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. మచిలీపట్నం ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్న ఎ.పద్మను అనంతపురం సీనియర్‌ సివిల్‌జడ్జిగా బదిలీ చేశారు. ఈ స్థానంలో శ్రీకాకుళం జిల్లా సీనియర్‌ సివిల్‌జడ్జిగా పనిచేస్తున్న ఎల్‌.హిమబిందును నియమించారు. మచిలీపట్నం అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్న కె.అరుణను అవనిగడ్డకోర్డు సీనియర్‌ సివిల్‌జడ్జిగా బదిలీచేశారు. ఈ స్థానంలో శ్రీకాకుళం అదన పు సీనియర్‌ సివిల్‌జడ్జిగా పనిచేస్తున్న సీహెచ్‌ యు గంధర్‌ను నియమించారు. ఈనెల 30 లోగా బదిలీ అయిన జడ్జిలు బాధ్యతలు చేపట్టాలని పేర్కొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:36 AM