Share News

అకాల వర్షం.. రైతులకు నష్టం

ABN , Publish Date - Apr 17 , 2025 | 01:06 AM

అకాలవర్షంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా విరుచుకుపడిన ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానతో ఆరబెట్టినపంటలు తడిసి ముద్దయ్యాయి.

అకాల వర్షం.. రైతులకు నష్టం
గౌరవరంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న అధికారులు

జగ్గయ్యపేట రూరల్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్ర జ్యోతి): అకాలవర్షంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా విరుచుకుపడిన ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానతో ఆరబెట్టినపంటలు తడిసి ముద్దయ్యాయి. కోతకు వచ్చిన పంటలు నేలవాలాయి. మరి కొందరు రైతులు గింజ ఆరిందని బస్తాలు ఎత్తి తరలించేం దుకు సిద్ధంగా ఉంచిన బస్తాలు తడిశాయి. జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లోని మొక్కజొన్న రైతులు ఆయా ప్రాంతాలలో అకాల వర్షాలతో సరైన వసతులు లేక ఆటోనగర్‌, ఇండసి్ట్రయల్‌ ఎస్టేట్‌ ప్రాంతాల్లోని రోడ్లపై ఆరబోసుకుంటున్నారు. రైతులు మాట్లాడుతూ పంటలు ఇంటికి వచ్చే తరుణంలో తడిసి రంగు మారటంతో పాటు ముక్క వాసన వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. పంటలకు సరైన ధర లేక ఇబ్బందులు పడుతుంటే అకాల వర్షం నడ్డి విరిచిందని చెబుతున్నారు. ఆయా గ్రామాల్లో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యంలో నీరు చేరటంతో మళ్లీ రోడ్లమీద ఆరబెట్టేందుకు ట్రక్కుకు రూ. 800లు చొప్పున తరలిస్తున్నామని చెబుతున్నారు.

పంటల పరిశీలన..

మండలంలోని తడిసిన పంట కల్లాలను జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి, స్థానిక రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ఏడీఏ భవానీ, ఏవో వరలక్ష్మీ, వీఆర్వోలు పాల్గొన్నారు.

విస్సన్నపేట: వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న, వరి పంటలను బుధవారం ఏడీఏ కె.శశికళ బుధ వారం పరిశీలించారు. 33శాతానికి మించి నష్టం వాటిల్లితే నమోదు చేసి ఉన్నతా ధికారులకు పంపు తామన్నారు. ఏవో జి.రాజ్యలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

తడిసిన ధాన్యం

గంపలగూడెం: మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం అర్థరాత్రి కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో ఉన్న ధాన్యం తడిచి రైతులు నష్టపోయారు. ఆరబెట్టిన ధాన్యం తడవడంతో రైతులు లబోదిబో మంటున్నారు. తడిచిన ధాన్యాన్ని ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

పెనుగంచిప్రోలులో ఈదురు గాలులు

పెనుగంచిప్రోలు: మండలంలో ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులతో కూడి వర్షం పడింది. రైతులు ముందు జాగ్రత్తలు తీసుకొని వరి పొలాల్లో ఉన్న ధాన్యం, మొక్కజొన్నల రాశులపై పట్టాలు కప్పి సురక్షితం చేసుకోవడంతో నష్టాన్ని తప్పించుకోగలిగారు. మామిడి కాయలు చాలా చోట్ల నేలరాలాయి.

Updated Date - Apr 17 , 2025 | 01:07 AM