Share News

లయోలాలో ప్రపంచ పుస్తక దినోత్సవం

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:36 AM

ఆంధ్రా లయోలా ఇంజనీరింగ్‌ కళాశాలలో ఐక్యూఏసీ డైరెక్టర్‌ ఫాదర్‌ డాక్టర్‌ బి.జోజిరెడ్డి ఆధ్వర్యంలో బుధ వారం ప్రపంచ పుస్తక దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

లయోలాలో ప్రపంచ పుస్తక దినోత్సవం

లయోలాలో ప్రపంచ పుస్తక దినోత్సవం

భారతీనగర్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా లయోలా ఇంజనీరింగ్‌ కళాశాలలో ఐక్యూఏసీ డైరెక్టర్‌ ఫాదర్‌ డాక్టర్‌ బి.జోజిరెడ్డి ఆధ్వర్యంలో బుధ వారం ప్రపంచ పుస్తక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో పాటు ఆంగ్ల రచయిత షేక్‌స్పియర్‌ జయంతి ఆంగ్లభాషా దినోత్సవం కావడంతో షేక్‌స్పియర్‌ రచనలపై విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఇటలీలోని ఫ్యూచర్లీ కంపెనీ సీఈవో ఎలిసా పిప్సిటెల్లి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ నేటి ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రాముఖ్యతను వివరించారు. విద్యా, వృత్తి పరమైన విజయానికి బలమైన కమ్యూనికేషన్‌గా ఆంగ్ల భాష ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రిన్సిపాల్‌ ఓ.మహేష్‌, విభాగాధిపతులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 12:36 AM