Share News

గాడి తప్పిన బీఎడ్‌ విద్య

ABN , Publish Date - Mar 25 , 2025 | 11:30 PM

డబ్బు చెల్లిస్తే చాలు తరగతులకు హాజరు కాకున్నా రికార్డులు రాయకున్నా బీఈడీ పట్టాలు ఇచ్చేస్తున్నారు. ఒరిజనల్‌ సర్టిఫికెట్లు లేక పోయినా పర్వాలేదంటూ అడ్మిషన్లు చేసుకుంటు న్నారు. రాయలసీమ యూనివర్సిటీకి అనుబంధంగా దాదాపు 45 బీఎడ్‌ కళాశాలు ఉన్నాయి.

గాడి తప్పిన బీఎడ్‌ విద్య

తరగతులు, ప్రాక్టికల్స్‌ లేకున్నా పట్టాలు

ఈడబ్ల్యూఎస్‌ కోటాలో అడ్డగోలుగా అడ్మిషన్లు

కర్నూలు అర్బన్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): డబ్బు చెల్లిస్తే చాలు తరగతులకు హాజరు కాకున్నా రికార్డులు రాయకున్నా బీఈడీ పట్టాలు ఇచ్చేస్తున్నారు. ఒరిజనల్‌ సర్టిఫికెట్లు లేక పోయినా పర్వాలేదంటూ అడ్మిషన్లు చేసుకుంటు న్నారు. రాయలసీమ యూనివర్సిటీకి అనుబంధంగా దాదాపు 45 బీఎడ్‌ కళాశాలు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి సొంత భవనాలు లేకున్నా వర్సిటీ అధికారులు అనుమతులు ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కర్నూ లు నగరంలో-3, డోన్‌-2, నంది కొట్కూరు-1 బీఎడ్‌ కళాశాలకు కనీసం సొంత భవనాలు కూడా లేవు. వర్సిటీలోని ఓ అధికారికి సమీప బంధువైన కళాశాల యజమాని నగరంలోని సీ క్యాంప్‌ సమీపంలోని శకుంతల కళ్యాణ మండపం దగ్గర ఒక రూమ్‌లో నడుపుతున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు ఉప కులపతికి ఫిర్యాదు చేశారు. జిల్లాలోని కొన్ని బీఎడ్‌ కళాశాలలు ఈడబ్ల్యూఎస్‌ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ లేకున్నా ఇతర రాష్ట్రాల విద్యార్థులను చేర్చుకుం టున్నారు. నంద్యాల జిల్లా డోన్‌ పట్టణంలో బీఎడ్‌ కళాశాల విద్యార్థులకు నిబంధనల ప్రకారం అదే జిల్లాలో పరీక్షలు జరపాలి. కానీ పరీక్షలను కర్నూలు జిల్లాలో నడపడం వివా దాస్పదంగా మారింది.

బీఈడీ అడ్మిషన్లు..

బీఈడీ కాలేజీల్లో సోషియల్‌ -25, బయోలజీ-20, మ్యాచ్‌ అండ్‌ ఫిజిక్స్‌ రెండికి కలిపి -20, ఇంగ్లీష్‌ -10 ప్రకారం కన్వీనరు కోటాలో విద్యార్థులను చేర్చుకోవాలి. మేనేజ్‌ మెంట్‌ కోటా కింద మరో 25 శాతం విద్యార్థులను చేర్చుకోవాలి. కానీ ఈ విధానం బీఈడీ కళాశాలల్లో అమలు కావడం లేదు. స్పాట్‌ అడ్మిషన్ల పేరుతో ఒకే సబ్జెక్టుకు ఇతర రాష్ట్రాల విద్యార్థులను చేర్చుకుంటున్నారన్న విమర్శ లు ఉన్నాయి. 60 శాతం ఇతర రాష్ట్రాల విద్యార్థులతో కళాశాలలు నడుపుతున్నారని ఉన్నత విద్యామండలికి కొందరు విద్యార్థులు గత సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం మరోసారి బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు అంశం తెరపైకి వచ్చినట్లు తెలిసింది.

ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క కళాశాల తరగతులు జరప కున్నా, ప్రాక్టికల్స్‌ నిర్వహిం చకున్నా వర్సిటీ అధికారులు యాజమాన్యాలతో లోపాయికారి ఒప్పదం కుదుర్చుకొని విద్యార్థులకు 80 శాతం బీఎడ్‌ పట్టాలు ఇస్తున్నారు. కళాశాల యాజమాన్యాలు ఇచ్చే ముడుపులకు కక్కుర్తి పడి బీఎడ్‌ విద్యార్థులు రాకున్నా బ్లాక్‌ బోర్డు టీచింగ్‌, ప్రాక్టికల్స్‌కు వచ్చినట్లు సంతకాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క కళాశాలకు ఎన్‌సీటీఈ(నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌) అనుమతులు లేకున్నా ఉర్దూ అడ్మిషన్లు చేర్చుకోవడం గమనార్హం. కళాశాల్లో వంద మంది విద్యార్థులకు 16 మంది, 50 మంది విద్యార్థులకు 8 మంది అధ్యాపకులు ఉండాలి. సీడీసీ విభాగం ప్రతి ఏటా అధ్యాపకుల జాబితాను పరిశీలించి అప్రూవు చేయాల్సి ఉంటుంది. కళాశాలల్లో మౌలిక వసతులను పరిగణలోకి తీసుకుని అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.

అన్నింటినీ పరిశీలిస్తాం

బీఎడ్‌ కళాశాలల తీరును స్వయంగా పరిశీ లించి లోపాలను సరి చేస్తాను. సొంత భవ నాలు లేకుండా అనుమ తులు ఇవ్వడం కుదరదు. ఏవైనా అలా ఉంటే విచారించి తదుపరి చర్యలకు ఆదేశిస్తాం. - వి. వెంకట బసవరావు, ఉపకులపతి, రాయలసీమ యూనివర్సిటీ

Updated Date - Mar 25 , 2025 | 11:30 PM