పరిశుభ్రత మన బాధ్యత
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:21 AM
పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత అని డీపీవో భాస్కర్, డీఎల్పీవో నూర్జహాన్ తెలిపారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రను శనివారం మండిగిరి పంచాయతీ పరిధిలో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈవోఆర్డీ జనార్థన్, కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
నియోజకవర్గాల్లో స్వచ్ఛ భారత్ ర్యాలీ
ఈ-వ్యర్థాలను సిబ్బందికి ఇవ్వాలి
ఆదోని రూరల్, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత అని డీపీవో భాస్కర్, డీఎల్పీవో నూర్జహాన్ తెలిపారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రను శనివారం మండిగిరి పంచాయతీ పరిధిలో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈవోఆర్డీ జనార్థన్, కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పత్తికొండ: చెత్తను సంపదగా మారుద్దామని డీఎల్‌పీవో వీరభద్రప్ప సూచించారు. స్వచ్ఛఆంధ్ర- స్వచ్ఛ దివస్‌లో భాగంగా శనివారం పత్తికొండ నాలుగు స్తంభాల కూడలిలో ప్రజలకు అవగాహన నిర్వహిం చారు. ఈ-వ్యర్థాలు పాడైన కంప్యూటర్లు, ఎలక్ర్టానిక్ వస్తువులు పంచాయతీ వాహనాలలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన చెత్తబుట్టలలో వేయాలని సూచించారు. సర్పంచ్ కొమ్ము దీపిక, గౌరవాధ్యక్షురాలు నాగరత్నమ్మ, టీడీపీ నాయకులు సాంబశివారెడ్డి, ప్రమోద్‌కుమా ర్‌రెడ్డి, ఈవో నరసింహులు ఉన్నారు.
వెల్దుర్తి: గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుదామని పం చాయతీ కార్యదర్శి లక్ష్మీనాథ్ పిలుపునిచ్చారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛదివస్‌లో భాగంగా కార్యాలయం నుంచి పాతబస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి, ప్రతిజ్ఞ చేయించారు. కార్యాలయాల్లో ఈవోఆర్డీ రవికిశోర్, తహసీల్దార్ చంద్రశేఖర్‌వర్మ నిర్వహించారు. ఏపీఎం అనురాధ, డీటీ రంగస్వామిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
తుగ్గలి: ఈ-వ్యర్థాలతో సంపద తయారు చేయాలని పశువైద్యాధికారి వెంకటేశ్వర్లు, ఏపీవో హేమసుందర్, టీడీపీ మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు అన్నారు. శనివారం ముక్కెళ్ల, రాంపల్లి తదితర గ్రామాల్లో స్వచ్చాంధ్ర-స్వచ్ఛ దివాస్‌లో భాగంగా విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఎలక్ర్టిక్, ప్లాస్టిక్ వ్యర్థాలను ఆరుబయట పడవేయ కుండా, డస్ట్‌బిన్‌లో ఉంచి, చెత్త సంపద కేంద్రాల్లోకి తరలించాలన్నారు. సర్పం చ్‌లు సుజాత, మనేంద్ర, టీడీపీ నాయకులు రామచంద్ర, శ్రీనివాసులు, భాలు, చెన్నకేశవులు, తదితరులు పాల్గొన్నారు.
ఆదోని టౌన్: పట్టణంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ డా. అనుపమ ర్యాలీ నిర్వహించారు. భీమాస్ కూడలిలో మానవ హారం నిర్మించి, ప్రతిజ్ఞ చేయించారు. చెత్త రీసైక్లింగ్ విఽధానం వివరించి, రసాయనాల దుష్ఫరిణామాలను వివరించారు.
ఆలూరు: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలూరులో శనివారం స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్రపై ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో భరత్ నాయక్, తహసీల్దార్ గోవింద్ సింగ్ మాట్లాడుతూ ఈ-వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా పంచాయతీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల కేంద్రంలో వేయాలన్నారు. పాత ప్యాన్లు, మిక్సి, టీవీలు, కూలర్లు అందులో వేయాలని సరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు సహకరించాలని కోరారు. డిప్యూటీ ఎంపీడీవో ప్రభాకర్ రావ్, టీడీపీ మండల కన్వీనర్ అశోక్, నాయకులు ఆంజనేయ పాల్గొన్నారు.
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
మద్దికెర: ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని ప్రభుత్వ వైద్యాఽ దికారి రాగిణి సూచించారు. శనివారం స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివాస్‌లో భాగంగా వైద్యశాల వద్ద ప్రతిజ్ఞ చేశారు. సీహెచ్‌వో నిరంజన్‌బాబు ఉన్నారు.