క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:27 AM
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో గత కొంతకాలంగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.4.10 లక్షలు నగదు, ఏడు సెల్‌ఫోన్లు స్వాఽధీనం చేసుకున్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు.
రూ.4.10 లక్షలు, సెల్‌ఫోన్లు స్వాధీనం
పరారీలో ఐదుగురు
కోవెలకుంట్ల, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో గత కొంతకాలంగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.4.10 లక్షలు నగదు, ఏడు సెల్‌ఫోన్లు స్వాఽధీనం చేసుకున్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. శనివారం కోవెలకుంట్ల పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నిందితుల అరెస్టును చూపారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కోవెలకుంట్ల పట్టణంలోని గాంఽధీనగర్ వెళ్లే రహదారిలో ఉన్న భార్గవ లాడ్జి పక్కన ఉన్న బహిరంగ ప్రదేశంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో డీఎస్పీ నేతృత్వంలో కోవెలకుంట్ల సీఐ హనుమంత నాయక్, ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి వారి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. కోవెలకుం ట్లకు చెందిన వడ్డె రఫీ అనే వ్యక్తి ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. రఫీతో పాటు కోవెలకుంట్లకు ఓబులపు రాజారెడ్డి, సురేశ్‌బాబు, వినోద్‌కుమార్, సునీల్, మద్దిలేటిని అదుపులోకి తీసుకున్నామని, ఐదుగురు పరారీలో ఉన్నారని తెలిపారు.