జింకల బెడదపై స్పందించిన డిప్యూటీ సీఎం
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:18 AM
ఆలూరు ప్రాంతంలో జింకల బెడదతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సస్పందించారు. జింకల దాడితో రైతులు పంటలు నష్టపోతున్నారని తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి నారాయణ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన సమస్యపై నివేదిక ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు.
నివేదిక ఇవ్వాలని అటవీ అధికారులకు ఆదేశం
ఆలూరు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ఆలూరు ప్రాంతంలో జింకల బెడదతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సస్పందించారు. జింకల దాడితో రైతులు పంటలు నష్టపోతున్నారని తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి నారాయణ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన సమస్యపై నివేదిక ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆదోని పారెస్ట్ రేంజ్ అధికారి తేజస్వి ఆదేశాల మేరకు ఆలూరులో సెక్షన్ అధికారులు శ్రీనివాసులు, హొళగుంద బీట్ అధికారులు బాలకృష్ణ, మధు మోహన్, విమల్ ఫిర్యాదుదారుడు నారాయణ రెడ్డిను కలసి చర్చించారు. జింకల పార్కు ఏర్పాటుకు ఆలూరులో స్థలం లేకపోవడంతో మంత్రాలయం పరిధిలోని తుంగభద్ర ప్రాంతంలో జింకల పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తానని అధికారులు హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు నారాయణ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.