Share News

సిబ్బందికి ఇబ్బందులు

ABN , Publish Date - Apr 24 , 2025 | 11:42 PM

పంచాయతీ రాజ్‌ శాఖలోని పీఐయూ కార్యాలయాన్ని హడావిడిగా కర్నూలు నుంచి నంద్యాలకు తరలించారు.

సిబ్బందికి ఇబ్బందులు
మూటల్లో ఉన్న ఫైల్స్‌

కార్యాలయం తరలింపుతో అవస్థలు

నంద్యాల హాస్పిటల్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ రాజ్‌ శాఖలోని పీఐయూ కార్యాలయాన్ని హడావిడిగా కర్నూలు నుంచి నంద్యాలకు తరలించారు. ఈ కార్యాలయ భవన సముదాయం సిద్ధంగా లేక పోవడంతో సామగ్రి ఎక్కడ పడితే అక్కడ ఉంచాల్సిన పరిస్ధితి నెలకొంది. నంద్యాలలోని పంచాయతీ రాజ్‌ భవనంపై ఉన్న ఒక గదిని పీఐయూకి కేటాయించారు. ఆ గదికి కిటికీలకు తలుపులు ఏర్పాటు చేయకపోవడంతో ఫైళ్ళకు ఏమాత్రం భద్రత ఉండేదీ అర్థం కావడం లేదు. పైగా కనీస సౌకర్యాలు లేక సిబ్బంది ఇబ్బందిప డుతున్నారు. 2021లో జిల్లా విభజనలో భాగంగా పంచాయరాజ్‌ శాఖలో ప్రాజెక్ట్‌ ఇంప్లిమెంటేషన్‌ యూనిట్‌(పీఐయూ)బనగానపల్లె, డోన్‌, నందికొట్కురు, నియోజకవర్గానికి సంబంధించి కర్నూలు డివిజన్‌ విభాగాన్ని కర్నూలులోని జిల్లా పరిషత్‌ ఆవరణలో నిర్వహిస్తున్నారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో గత నాలుగు సంవత్సారాల నుండి కర్నూలు జెడ్పీ ఆవరణలోనే పీఐయూ కార్యలయం కొనసాగు తోంది. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చాక నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి గనియా నంద్యాల కు కార్యాలయం రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ చూస్తే పీఐయూ కార్యాల యానికి భవనం సిద్ధంగా లేక పోవడంతో వచ్చిన సామగ్రిని ఎక్కడ పడితే అక్కడ ఉంచారు. ఫైళ్లను మూటలు కట్టి పెట్టారు. ఫర్నిచర్‌ ఎక్కడ పడితే అక్కడ ఉంది. నంద్యాలకు సంబంధిన కార్యాలయం నంద్యాల కు రావడంపట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యాలయం ఈఈ, ిపీఏటు ఈఈ (డీఈఈ) డీఏఓ సూపరింటెండెంట్‌, నలుగురు సీనియర్‌ అసిస్టెంట్లు, నలుగురు జూనియర్‌ అసిస్టెం ట్లు, నలుగురు రికార్డు అసిస్టెంట్లు, నలుగురు జేఈలు, టెక్నికల్‌ ఆఫీసర్‌, బీపీఓ, ఇద్దరు టైపిస్టులు, అటెండర్లు కలిపి ప్రస్తుతం 27 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా కర్నూలు నుండి నంద్యాలకు వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. కార్యాల యంలో కూర్చోడానికి కూడా సరైన స్ధలం లేక మూడు భవనాల్లో సిబ్బంది సిబ్బంది విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. కార్యాలయం తరలింపు విషయం ఉన్నతాధికారులకు తెలిసిన ప్పటికీ ముందు చూపుగా భవనం సిద్ధం చేసుకోక పోవడం గమనార్హం.

Updated Date - Apr 24 , 2025 | 11:42 PM