రాజకీయాల్లోకి కులాన్ని తీసుకురాకండి
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:33 AM
రాజకీయాల్లోకి కులాన్ని తీసుకురావద్దని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో వాలని కురువ కార్పొరేషన్ చైర్మెన్ మాన్వి దేవేంద్రప్పకు వైసీపీ జిల్లా మహిళ అధ్యక్షురాలు కురువ శశికళ కృష్ణమో హన్ సవాల్ విసిరారు.
వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కురువ శశికళ
ఆలూరు, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లోకి కులాన్ని తీసుకురావద్దని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో వాలని కురువ కార్పొరేషన్ చైర్మెన్ మాన్వి దేవేంద్రప్పకు వైసీపీ జిల్లా మహిళ అధ్యక్షురాలు కురువ శశికళ కృష్ణమో హన్ సవాల్ విసిరారు. గురువారం ఆలూరు అర్‌అండ్‌బీ అతిథిగా గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అరికెరకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ కురువ బండారి ఈరన్న హత్య అనంతరం ఎమ్మెల్యే విరుపాక్షి బాధితులకు అండగా ఉన్నారన్నారు. కురువ కార్పొరేషన్ చైర్మెన్ తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తాను బాధిత కుటుంబానికి కుట్టు మిషన్‌తో పాటు రూ.10వేలు ఆర్థిక సాయం చేశానన్నారు. కుటుంబానికి రూపాయి అయినా సహాయం చేశారా అని ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాధిత కుటుంబా నికి రూ.5లక్షలు ఆర్థిక సాయం చేశారన్నారు. చౌకబారు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని, తాను డిప్యూటీ మేయర్ స్థానం నుంచి వచ్చానని, పార్టీ అధినేత జగన్ సహకారంతో ఏపీ రాజకీయాల్లో కొనసాగుతామన్నారు. నాయకులు కృష్ణ మోహన్ పాల్గొన్నారు.