భక్తిశ్రద్ధలతో ఈస్టర్
ABN , Publish Date - Apr 21 , 2025 | 01:29 AM
మంత్రాలయం, మాధవరం, రచ్చమర్రి, మాలపల్లి, రాంపురం, చెట్నహళ్లి, సూగూరు, వగరూరు, తిమ్మాపురం, తుంగభద్ర గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో ఈస్టర్ జరుపుకున్నారు.
చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
మంత్రాలయం, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం, మాధవరం, రచ్చమర్రి, మాలపల్లి, రాంపురం, చెట్నహళ్లి, సూగూరు, వగరూరు, తిమ్మాపురం, తుంగభద్ర గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో ఈస్టర్ జరుపుకున్నారు. సీఎస్‌ఐ డివిజినల్ చైర్మన రెవ. వేదనాయకం, జానవెస్లీ, ఎస్‌డీ రాజన్న, యేసయ్య, రెవ.సేతు ఆధ్వర్యంలో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెల్లవారుజామున ఆధ్యాత్మిక క్రైస్తవ భక్తి పాటలతో గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుతో యేసుక్రీస్తు సమాధి నుంచి లేశారని సువార్త ప్రకటించారు. దావీదు తనయా యేసన్న.... యూదుల రాజా హోసన్నా.... అంటూ జయధ్వనులు పలుకుతూ సంబ రాలు చేసుకున్నారు. అనంతరం చర్చిల్లో ఈస్టర్ ప్రత్యేకతను పాస్టర్లు వాక్య సందేశాన్ని చేశారు. కార్యక్రమంలో సంఘ నిర్వాహకులు భూపతి, తిమోతి, వినోద్, జగదీష్, పాలరాజు, మేకల తిమోతి, యోబు, ప్రభుదాసు, కుమార్, దేవదాసు, మరియప్ప, నరసింహులు, దానియేలు, రాజు పాల్గొన్నారు.
కోసిగి: మండల కేంద్రమైన కోసిగితో పాటు చింతకుంట, పల్లెపాడు, డి.బెళగల్, ఐరంగల్, సాతనూరు, కందుకూరు, కామనదొడ్డి, జుమాల దిన్నె, వందగల్లు గ్రామాల్లో ఆదివారం క్రైస్తవులు ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచే చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎస్‌ఐ, రోమన క్యాథలిక్ , క్రీస్తు సంఘం, ఏసుకృపా ప్రార్థన మందిరం వంటి చర్చిలలో ఫాస్టర్లు రాజారత్నం, ప్రేమ్ కుమార్, దేవపుత్ర, ఫాదర్ జాకోబు, చిదానంద, థోని, శ్రీను, శాంతమూర్తి ఆయా చర్చిలలో యేసు సందేశమిచ్చారు.