టీటీడీపై అసత్య ప్రచారాలు
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:27 PM
టీటీడీకి చెందిన గోశాలలో ఆవుల మరణాలపై వైసీపీ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నాడని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆరోపించారు
టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి
కర్నూలు అర్బన్, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): టీటీడీకి చెందిన గోశాలలో ఆవుల మరణాలపై వైసీపీ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నాడని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆరోపించారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో శ్రీవారి మూలవిరాట్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన మళ్లీ ఇప్పుడు ఇలాంటి దుష్ప్రచారాలకు తెరతీస్తున్నాడన్నారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆయన కుట్రలు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కరుణాకర్‌రెడ్డి మత విద్వేషాలు రెచ్చగొడుతూ, టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా కామెంట్స్ చేయడంపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తిక్కారెడ్డి డిమాండ్ చేశారు.