క్షమా గుణమే క్రీస్తు మార్గం
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:30 PM
దయ, క్షమాగుణం మానవ జాతి మనుగడకు ఏకైక మార్గమని ప్రబోధించిన నవయుగ కర్త క్రీస్తు ప్రభువు. సమస్త మానవాళి చేసిన పాపాల ప్రాయశ్చిత్తం కోసం ఆయన శిలువపై ప్రాణాలు అర్పించాడు. తిరిగి మూడో రోజు సమాధి నుంచి లేచాడు.
నేడు గుడ్‌ఫ్రైడే... మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు
కర్నూలు కల్చరల్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): దయ, క్షమాగుణం మానవ జాతి మనుగడకు ఏకైక మార్గమని ప్రబోధించిన నవయుగ కర్త క్రీస్తు ప్రభువు. సమస్త మానవాళి చేసిన పాపాల ప్రాయశ్చిత్తం కోసం ఆయన శిలువపై ప్రాణాలు అర్పించాడు. తిరిగి మూడో రోజు సమాధి నుంచి లేచాడు. పొరుగువారిని ప్రేమించాలని, వారి తప్పులను క్షమించాలని బోధించాడు. క్రైస్తవ మత విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు శుక్రవారం శిలువ వేయబడ్డారు. ఆ రోజును గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లాలోని క్రైస్తవులు ‘గుడ్‌ఫ్రై డే’ వేడుకను నిర్వహించుకోడానికి సిద్ధమయ్యారు. దయామయుని తలుస్తూ ఉపవాసం, ప్రార్థనలతో గడుపనున్నారు. ఈ సందర్భంగా అన్ని చర్చీలలో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. మత పెద్దలు గుడ్‌ఫ్రై డే సందేశాన్ని అందించనున్నారు.
నగరంలో గుడ్ ఫ్రై డే ప్రార్థనలు...
నగరంలోని సీఎస్‌ఐ చర్చి, కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్టు చర్చి, రాక్‌వుడ్ చర్చి, స్టాంటన్ చర్చి, ప్రార్థన మందిరం, హోసన్న మందిరం, బిషప్ చర్చిలతోపాటు వివిధ ప్రాంతాల్లోని చర్చిలలో శుక్రవారం గుడ్ ఫ్రై డే ప్రార్థనలు నిర్వహిస్తారు.