నివేదికలు ఇవ్వండి
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:44 PM
శ్రీశైల క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
తొమ్మిది అంశాలతో అభివృద్ధి ప్రణాళికలు
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లె, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో శ్రీశైల క్షేత్ర అభివృద్ధిపై జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీశైల దివ్యక్షేత్రంతో పాటు చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలను ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా, ఆహ్లాదకరంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. అందుకు అవసరమయ్యే డాక్యుమెంట్లు, సర్వేనెంబర్లవారీగా విస్తీర్ణ వివరాలివ్వాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం వసతి, క్యూలైన్లు, రవాణా, పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాల తొమ్మిది అంశాలతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆమె చెప్పారు. డీఆర్వో రామునాయక్, డీఎ్‌ఫఓ సాయిబాబా, శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, ఆత్మకూరు ఆర్డీవో అరుణజ్యోతి, ఇరిగేషన్ ఎస్‌ఈ శివప్రసాదరెడ్డి, పర్యాటక శాఖాధికారి సత్యనారాయణమూర్తి, ఏపీ టీడీసీ డీవీఎం లక్ష్మీనారాయణ, పాల్గొన్నారు.