పెంచిన ధరలు తగ్గించాలి: సీపీఎం
ABN , Publish Date - Apr 10 , 2025 | 01:00 AM
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు డిమాం డ్ చేశారు.
ఎమ్మిగనూరు టౌన, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు డిమాం డ్ చేశారు. బుధవారం సోమప్ప సర్కిల్‌లో సీపీఎం అధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీసీఎం పట్టణ కార్యదర్శి గోవిందు, రాముడు మాట్లాడుతూ అంతర్జాతీయంగా ముడిచమురు ధర భారీగా తగ్గిన కేంద్ర ప్రభుత్వం సిలిండర్‌పై రూ. 50 పెంచడం అన్యాయమని విమర్శించారు. పెంచిన ధరలు తగ్గించకపోతే సీపీఎం అధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాలప్ప, సురేష్, నరసయ్య, బజారి, సుభాన, తిమ్మయ్య పాల్గొన్నారు.