అధికారుల పర్యవేక్షణ కరువు
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:48 AM
ప్రభుత్వ పాఠశాలలో ఉపాఽధ్యాయుల బోధన సక్రమంగా లేకపోవడం వల్లనే ప్రతి ఏడాది పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం తగ్గుతోందని, విద్యాశాఖ అధికారులు తగు శ్రద్ధ తీసుకోవడం లేదని గోనెగండ్ల ఎంపీటీసీ రజియాసుల్తానా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండల సమావేశంలో విద్యాశాఖతీరుపై మండిపడ్డ ఎంపీటీసీ
గోనెగండ్ల, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో ఉపాఽధ్యాయుల బోధన సక్రమంగా లేకపోవడం వల్లనే ప్రతి ఏడాది పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం తగ్గుతోందని, విద్యాశాఖ అధికారులు తగు శ్రద్ధ తీసుకోవడం లేదని గోనెగండ్ల ఎంపీటీసీ రజియాసుల్తానా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీడీవో సమావేశ భవనంలో ఎంపీపీ నసూరుద్దీన అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ రజియాసుల్తానా మాట్లాడు తూ ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు పిల్లలను ఆకట్టుకు నేందుకు ఇళ్లుళ్లు తిరుగుతున్నారని, ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆమె వాదనకు సభ్యులందరు మద్దతు ప్రకటించారు. అలాగే ఎంఈవో రామాంజినే యులు మాట్లాడుతూ మండలంలో విద్యాబోధన సక్రమంగా జరుగు తుందని మండల వాప్తంగా 10,696 మంది విద్యార్థులు చదువుతు న్నారని తెలిపారు. ఏవో హేమలత మాట్లాడుతూ వ్యవసాయ యాం త్రీకీకరణలో భాగంగా రూ.10లక్షల విలువైన పనిముట్లు మంజూర య్యాయని అన్నారు. 20శాతం సబ్సిడీతో డ్రోనలను రైతులకు మం జూరు చేస్తామన్నారు. పీఆర్‌ఏఈ శివశంకర్ మాట్లాడుతూ పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా పల్లెలో సీసీ రోడ్డు, డ్రైనేజీలను పూర్తి చేశా మని, 4, 5 విడతల్లో మరిన్ని పనులు చేస్తామన్నారు. స్ర్తీశక్తి భవనానికి నిధులు కేటాయించాలని ఏపీఎం హేమలత కోరారు. ఇందుకు ఎంపీడీవో స్పందిస్తూ నిధులను విడుదల చేసేవిధంగా చూస్తామని హామీ ఇచ్చారు. సీఐ విజయభాస్కర్ మాట్లాడుతూ మండలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. పలు శాఖల అధికారులు తమ నివేదిక చదివి వినిపించారు. సమావేశంలో ఎంపీడీవో మణిమంజరి, పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచలు, కార్యదర్శులు, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.