మత సామరస్యంతో మెలగాలి
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:56 AM
ప్రజలు మత సామరస్యంతో మెలగాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ
కర్నూలు కల్చరల్, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): ప్రజలు మత సామరస్యంతో మెలగాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో నందికొ ట్కూరుకు చెందిన ప్రముఖ మిమిక్రీ, రంగస్థల కళాకారుడు పి. ఖాదర్ బాబుకు అభినందన సభ, ఆయన త్రిపాత్రాభినయంతో నటించి, రూపొందించిన శ్రీకృష్ణ రాయబారం నుంచి ‘శయన ఘట్టం’ షార్ట్‌ఫిల్మ్ ప్రదర్శన, మిమిక్రీ షో, సంగీత విభావరి కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన టీజీ వెంకటేశ ఖాదర్ బాబును అభినందిం చారు. టీజీ వెంకటేశ మాట్లాడుతూ ఇటీవల దురదృష్టకర పరిణా మాలు, జాతిలో విద్వేషాన్ని కలిగించే విధంగా సంభవించారని అన్నారు. మనమందరం సమైక్యంగా ఉంటూ వాటిని ఎదుర్కోవాలని సూచించారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ కళాక్షేత్రం నిరంతరం కళల కాణాచిగా రూపొందిస్తున్నామని చెప్పారు. అనంతరం డాక్టర్ బాలమద్దయ్య, విశ్రాంత ఎప్పీ లక్ష్మీ నాయక్, ఎపీఎస్పీ డీఎస్పీ మహబూబ్ బాషాలు ప్రసంగించారు. అనంతరం గాయనీ గాయకులు సుధా రాణి, హబీబ్, బాలవెంకటేశ్వర్లు నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను అలరింపజేసింది. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైౖర్మన కేజీ గంగాధర్‌రెడ్డి, సీనియర్ రంగస్థల నటులు పి. దస్తగిరి, క్రిష్టఫర్, మహమ్మద్ మియా, ఇనాయతుల్లా పాల్గొన్నారు.
దేశ సమైక్యతను తెలిపే కవిత్వం కవులు రాయాలి: దేశ సమైక్యతను తెలిపే కవిత్వాన్ని కవులు రాయాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలోగల సాహిత్య వేదిక సమావేశ హాలులో ప్రముఖ కవి గద్వాల ఈరన్న రాసిన ‘కవిగూర గంప’ కవితా సంపుటిని ఆయ న ఆవిష్కరించి మాట్లాడారు. ఆదోని ప్రాంతానికి చెందిన కవి గద్వాల ఈరన్న పుస్తకాన్ని కర్నూలులో ఆవిష్కరించుకోవడం విశే షమని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ గద్వాల ఈరన్న ఆర్టీసీలో డిపో మేనేజరుగా పదవీ విరమణ చేసిన తర్వాత చక్కని కవితలు రాశారని, వాటిని పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీ యమని అన్నారు. టీజీవీ కళాక్షేత్రం తరపున టీజీ వెంకటేశ కవి ఈరన్నను శాలువ కప్పి, జ్ఞాపిక అందజేసి సత్కరించారు. అనంతరం కవి గద్వాల ఈరన్న మాట్లాడుతూ తనలోని భావాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగణంగా కవిత్వం రాశారని చెప్పారు. కార్యక్రమంలో నగర బలిజ సంఘం నాయకులు సోమశేఖర్, గాండ్ల లక్ష్మన్న పాల్గొన్నారు.