జూనోటిక్ వ్యాధులపై వైద్య విజ్ఞాన సదస్సు
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:28 AM
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఓల్డ్ సీఎల్‌జీలో శనివారం జూనోటిక్ వ్యాధులపై వైస్ ప్రిన్సిపాల్ మైక్రోబయాలజి హెచవోడీ డా.ఏ.రేణుకాదేవి ఆధ్వ ర్యంలో వైద్యవిజ్ఞాన సదస్సు జరిగింది.

కర్నూలు హాస్పిటల్, మార్చి 29(ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఓల్డ్ సీఎల్‌జీలో శనివారం జూనోటిక్ వ్యాధులపై వైస్ ప్రిన్సిపాల్ మైక్రోబయాలజి హెచవోడీ డా.ఏ.రేణుకాదేవి ఆధ్వ ర్యంలో వైద్యవిజ్ఞాన సదస్సు జరిగింది. ప్రజలు, పర్యావరణ మధ్య సంబంధం గురించి డాక్టర్ రేణుకాదేవి వివరించారు. జూనోటిక్ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా వ్యాధులు ఎలా సంక్రమి స్తాయో వివరించారు. మైక్రోబయాలజీ వైద్యులు విజయలక్ష్మి, కుసు మ, అరుణ, హరిత, నాగజ్యోతి, చక్రపాణి పాల్గొన్నారు.