Share News

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

ABN , Publish Date - Apr 21 , 2025 | 12:27 AM

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలపై ఉపాధ్యాయ అభ్యర్థులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2645 ఉపాధ్యాయ పోస్టులు

స్కూల్‌ అసిస్టెంట్లు 828, ఎస్‌జీటీలు 1817

ఉపాధ్యాయ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు పుట్టిన రోజు కానుక

నిరుద్యోగుల హర్షం

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలపై ఉపాధ్యాయ అభ్యర్థులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల ముందు మెగా డీఎస్సీని నిర్వ హిస్తా మని ఇచ్చిన మాటను నిలుపుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకే సాధ్యమైందని నిరుద్యోగులు అంటున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. ఆ వెంటనే ఉపాఽధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను నిర్వహించి ఫలితాలు విడుదల చేశారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో టెక్నికల్‌ సమస్యలు తలెత్తడంతో డీఎస్సీ నోటిఫి కేషన్‌ నిర్వహించడంలో కొంత కాలయాపన జరిగింది. సీఎం చంద్రబాబు పుట్టినరోజు కానుకగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యా వనరుల శాఖ మంత్రి ఆదివారం ప్రక టించారు. ఈ నెల 20వ తేదీ నుంచి డీఎస్సీ ప్రక్రియను కొన సాగుతుందని నారా లోకేశ్‌ తెలిపారు. డీఎస్సీ షెడ్యూల్‌ ప్రకా రం ఏప్రిల్‌ 20 నుంచి మే 15వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఏప్రిల్‌ 20 నుంచి మే 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఫీజుల చెల్లింపులు, దరఖాస్తుల స్వీకరణ ముగింపు గడువు ప్రకటించారు. మే 20వ తేదీన మాక్‌టెస్టు జరుగుతుంది. మే 30వ తేదీ నుంచి అభ్య ర్థులు హాల్‌టికెట్‌ను డౌన్‌లోడు చేసుకోవచ్చు. జూన్‌ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు కంప్యూటర్‌ బెస్డ్‌ విధా నంలో ఆన్‌లైన్‌ పరీక్షలు కొనసాగుతాయి. అన్ని పరీక్షలు పూర్తయిన వెంటనే రెండు రోజుల్లో ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ప్రాథమిక కీ విడుదల అనంతరం 7 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ, తుది కీ విడుదలైన ఏడు రోజుల తర్వాత మెరిట్‌ జాబితా కీ విడుదల జరుగుతున్నట్లు నోటిఫికేషన్‌ షెడ్యూల్‌లో ప్రకటించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటిస్తారని చెప్పి వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల కలలను నిజం చేస్తోంది. ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ నిర్వహిస్తాననీ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రభుత్వం చేపట్టిన మొదటి పైల్‌ పైన మెగా డీఎస్సీ 16,347 పోస్టులతో సంతకం చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 2024 సంవత్సరం అక్టోబరు 3 నుంచి 21వ తేదీ వరకు టెట్‌ ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించి ఆఘమేఘాల మీద టెట్‌ పలితాలు కూడా ప్రకటించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు మొత్తం 54,083 మంది టెట్‌కు హాజరయ్యారు.

ఉమ్మడి జిల్లాలో 2645 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ

జిల్లా పరిషత్‌, ప్రభుత్వ, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ పాఠశాలలో అన్ని కేటగిరీలో కలిపి కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్ల పోస్టులు మొత్తం 2645 ఖాళీలు ఉన్నాయి. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 828, ఎస్‌జీటీ పోస్టులు 1817 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ఇవి కాక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మరో 33 ఉపాధ్యాయ ఖాళీలు చూపారు. ఇందులో ఎస్‌జీటీలు 10 కాగా, మిగిలిన పోస్టులు 23 ఉన్నాయి.

ఉచిత శిక్షణ: రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా నిరుపేదలైన నిరుద్యోగుకు ఉచిత డీఎస్సీ కోచింగ్‌ ప్రభుత్వం చెప్పిస్తోంది. శిక్షణ పొందిన నిరుద్యోగులకు ఆయా సంక్షేమ శాఖల ద్వారా శిక్షణ, స్టయిఫండ్‌తో పాటు ఉచితంగా డీఎస్సీ మెటీరియల్‌ను సరఫరా చేస్తుంది. ఉచిత కోచింగ్‌ నిరుద్యోగులకు సువర్ణ అవకాశం.

పకడ్బందీగా డీఎస్సీ నిర్వహణ

ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభత్వం చేపట్టనున్న మెగా డీఎస్సీ నిర్వహణను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. ఈసారి అభ్యర్థులు ఎన్ని సబ్జెక్టులైనా డీఎస్సీ రాసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే.. దరఖాస్తుల చేసుకునే సమయంలోనే ఆయా ఉద్యోగాలకు ప్రియారిటీ పరంగా ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంది. దీని ప్రకారమే మెరిట్‌ అభ్యర్థులకు ఉద్యోగ నియామకాలు ఉంటాయి. డీఎస్సీలో మెరిట్‌ వచ్చిన అభ్యర్థులకు రిజర్వేషన్‌, రోస్టర్‌లో 1:1 ప్రకారం నేరుగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేస్తారు. ఎవరైనా అభ్యర్థులు గ్హొజరైతే కింద మెరిట్‌ ప్రకారంగా అభ్యర్థులకు ఉద్యోగ ఉత్తర్వులు పంపుతారు. షెడ్యూల్‌ ప్రకారం డీఎస్సీ పరీక్ష ఫీజుల చెల్లింపులు, దరఖాస్తుల సమర్పణ, పరీక్ష నిర్వహణ వంటి వివరాలను డీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచాం.

- శామ్యూల్‌పాల్‌, డీఈవో, కర్నూలు

Updated Date - Apr 21 , 2025 | 12:27 AM