వలసలు లేని పత్తికొండగా మారుద్దాం: ఎమ్మెల్యే
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:19 AM
: హంద్రీనీవా నీటితో వలసలు లేని పత్తికొండగా మారుద్దామని ఎమ్మెల్యే శ్యాం బాబు పిలుపు నిచ్చారు
రైతులకు వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే శ్యాంబాబు
పత్తికొండ, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా నీటితో వలసలు లేని పత్తికొండగా మారుద్దామని ఎమ్మెల్యే శ్యాం బాబు పిలుపు నిచ్చారు. ఏడీఏ మోహన్ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో శనివారం రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద సబ్సిడీపై స్ర్పే పంపు సెట్లు, ట్రాక్టర్, వ్యవసాయ పనిము ట్లను పంపిణీ చేశారు. ఈ పథకం కింద 169 మంది రైతులకు రూ.327 లక్షల వ్యవసాయ పరికరాలను రాయితీతో ఇచ్చామన్నారు. హంద్రీ నీవా నీటితో చెరువులకు నీటిని అం దించి, పొలాలకు నీనరు అందించేం దుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సాంబశివారెడ్డి, బత్తిన వెంకటరాముడు, తిమ్మయ్య చౌదరి, లోక్‌నాథ్, వెంకటపతి, గురుస్వామి, ఈశ్వరప్ప, పత్తికొండ ఏవో వెంకటరాముడు పాల్గొన్నారు.