ముంపు బాధితులకు స్థలాలు ఇవ్వాలి
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:34 PM
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో ఆస్తులు పోగొట్టుకుని ఇతర ప్రాంతాల్లో కాలం వెళ్లదీస్తున్న ముంపు గ్రామాల ప్రజలకు స్థానికంగానే స్థలాలు ఇచ్చి గృహాలు నిర్మించి ఇవ్వాలని నీటి ముంపు స్థానికేతర నిర్వాసితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డిమాండ్ చేసిన బాధితులు
కొత్తపల్లి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో ఆస్తులు పోగొట్టుకుని ఇతర ప్రాంతాల్లో కాలం వెళ్లదీస్తున్న ముంపు గ్రామాల ప్రజలకు స్థానికంగానే స్థలాలు ఇచ్చి గృహాలు నిర్మించి ఇవ్వాలని నీటి ముంపు స్థానికేతర నిర్వాసితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తపల్లి మండలంలోని పాత సిద్ధ్దేశ్వరం గ్రామానికి చెందిన నీటి ముంపు స్థానికేతర నిర్వాసితులు గత 40 ఏళ్ల క్రితం గ్రామాన్ని వదిలి కర్నూలు, మద్దూరు, పెసరవాయి, నందికొ ట్కూరు, జూపాడుబంగ్లా, తాండ్రపాడు తదితర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గురువారం సుమారు 150 మంది స్థానికేతర ముంపు బాధితులు పాత సిద్ధేశ్వరం చేరుకుని తమకు స్థానికంగానే మూడు సెంట్ల స్థలం ఇచ్చి గృహాలు నిర్మించి ఇవ్వాలని, ఇక్కడే తమకు రేషన్, ఆధార్, ఓటరు కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని పాతసిద్ధేశ్వరం వద్ద వారు ఆందోళనలు చేపట్టారు.